
బిగ్‌బాస్ సీజన్7(Bigg boss season7) చివరి దశకు చేరుకుంది. ఇంకా కేవలం రెండు వారాల ఆట మాత్రమే మిగిలుంది. అయితే ఈ సీజన్ మాత్రం గత సీజన్స్ కన్నా చాలా బిన్నంగా జరుగుతోంది. గత సీజన్ లలో విన్నర్ ఎవరు కానున్నారు అనేది షో మధ్యలోనే చెప్పే అవకాశం ఉండేది. కానీ ఈ సీజన్ లో మాత్రం ఆ అవకాశం లేకుండా పోయింది. ఒకవారం ఒకరు విన్నర్ అనిపిస్తే.. మరోవారం మరొకరు అనేలా సాగుతోంది. అందులో పల్లవి ప్రశాంత్, అమర్, శివాజీ ఉన్నారు. ఈ ముగ్గురి మధ్యనే టఫ్ ఫైట్ జరుగనుంది.
అయితే.. బిగ్‌బాస్‌కు వెళ్లిన ప్రతీ ఒక్కరికీ కెప్టెన్ కావాలనే ఆశ ఉంటుంది. అందుకోసం చాలా కష్టపడతారు. ఈ సీజన్‌లో అమర్ దీప్ కూడా అలానే కషటపడ్డారు. కానీ.. కెప్టెన్ మాత్రం కాలేకపోయాడు. చివరి అవకాశం కూడా దక్కకపోవడంతో.. చాలా ఎమోషనల్ అయ్యాడు అమర్ దీప్. ఒకే ఒక్క అవాకాశం ఇవ్వమని అందరినీ హౌస్ మేట్స్ అందరినీ అడిగాడు. కానీ ఫలితం దక్కలేదు.
దీంతో బయటనుండి అమర్‌కు సపోర్ట్ గా నిలిచారు అరియానా. ఇందులో భాగంగా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ చేశారు. అమర్ కెప్టెన్ కాలేదని బాధపడకు. సీజన్ 3లో రాహుల్ సిప్లిగంజ్ కూడా కెప్టెన్ అవలేదు కానీ.. టైటిల్ గెలిచాడు కదా. ప్లీజ్ స్ట్రాంగ్‌గా ఉండురా.. ఈ ప్రపంచం నీ కోసం మరిన్ని పెద్ద ప్లాన్స్‌తో నీ ముందుకు వస్తుంది.. అని రాసుకొచ్చారు. అరియానా చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.