రామ్ చరణ్ సినిమాలో బంపర్ ఆఫర్ కొట్టేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్

రామ్ చరణ్ సినిమాలో బంపర్ ఆఫర్ కొట్టేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్

బిగ్ బాస్(Bogg boss) కంటెస్టెంట్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram charan) సినిమాలో అదిరిపోయే ఛాన్స్ కొట్టేశారు. హౌస్ లోకి లేట్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ కంటెస్టెంట్ పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కబోతున్న ఈ సినిమాలో తన స్థానాన్ని ఫిక్స్ చేసుకున్నాడు. ఇదే విషయాన్ని ఆ సినిమా దర్శకుడు బిగ్ బాస్ స్టేజిపై కన్ఫర్మ్ చేశారు. దీంతో ఆ కంటెస్టెంట్ ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యాడు. 

ఇంతకీ ఆ కంటెస్టెంట్ ఎవరో తెలుసా అర్జున్ అంబటి(Arjun Ambati). ప్రస్తుతం ఈ సీరియల్ నటుడు బాగ్ బాస్ సీజన్ 7లో కంటెస్టెంట్ కొనసాగుతున్నాడు. ఐదువారల తరువాత వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఈ నటుడు ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ ను సంపాదించుకున్నాడు. అంతేకాదు ఇంట్లోకి వచ్చిన రెండోవారమే కెప్టెన్ కూడా అయ్యాడు. దీంతో బిగ్ బాస్ సీజన్ 7లో స్ట్రాంగ్ గా మారిపోయాడు. 

తాజాగా ఈ సీజన్ లో ఫ్యామిలీ ఎపిసోడ్ జరిగింది. ఇందులో భాగంగా అర్జున్ అంబటిని కలవడానికి ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సనా స్టేజిపైకి వచ్చారు. ఈ దర్శకుడు తన తరువాతి సినిమాను గగ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో చేస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఇప్పుడు ఈ సినిమాలో అర్జున్ అంబటి ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారని బిగ్ బాస్ స్టేజిపై ఓపెన్ గా చెప్పేశారు బిచ్చిబాబు. దీంతో అర్జున్ అంబటి ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యాడు. మరి ఈ సినిమాతో అర్జున్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడు? అది అతని కెరీర్ కి ఏవిదంగా ఉపయోగపడనుంది అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.