ఆర్మూర్  బార్​ అసోసియేషన్​ ప్రమాణ స్వీకారం

ఆర్మూర్  బార్​ అసోసియేషన్​ ప్రమాణ స్వీకారం

ఆర్మూర్, వెలుగు:  కొత్తగా  ఎన్నికయిన ఆర్మూర్  బార్ అసోసియేషన్ కార్యవర్గం   సీనియర్ సివిల్ జడ్జి నసీం సుల్తానా సమక్షంలో సోమవారం  ప్రమాణ స్వీకారం చేసింది.  బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా తెడ్డు నర్సయ్య, ఉపాధ్యక్షుడుగా పోడేటి శంకర్,  ప్రధాన కార్యదర్శిగా దేవరశేట్టి అరుణ్ కుమార్, కోశాధికారిగా తుమ్మ సుకేశ్,  సంయుక్త కార్యదర్శిగా సింధుకర్ చరణ్, గ్రంథాలయ కార్యదర్శిగా సూర సురేశ్  ప్రమాణ స్వీకారం చేశారు. ఎలక్షన్ ఆఫీసర్లు  గటడి ఆనంద్ , తాళ్ళ శ్రీనివాస్,  సీనియర్ అడ్వకేట్స్​ లోక భూపతి రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, నరేందర్, జగదీశ్​తదితరులు కొత్త కార్యవర్గాన్ని  సన్మానించారు.