అభివృద్ధి కోసం బీజేపీకి ఓటేయండి : ధర్మపురి అర్వింద్

అభివృద్ధి కోసం బీజేపీకి ఓటేయండి : ధర్మపురి అర్వింద్
  •     ఎంపీ ధర్మపురి అర్వింద్ 

ఆర్మూర్, మాక్లూర్​, వెలుగు : అభివృద్ధి కోసం బీజేపీకి ఓటేసి గెలిపించాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కోరారు. ఆదివారం ఆర్మూర్ మండలం అంకాపూర్ లో బీజేపీ ఆర్మూర్ బీజేపీ అభ్యర్థి పైడి రాకేశ్​రెడ్డి ఆధ్వర్యంలలో పలువురు బీఆర్ఎస్ కు చెందిన లీడర్లు బీజేపీ లో చేరారు. వారికి ఎంపీ అర్వింద్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ధర్మపురి మాట్లాడుతూ..  ఆర్మూర్ బీజేపీ అభ్యర్థి పైడి రాకేశ్​రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.

ఆర్మూర్ టౌన్ బీఆర్ఎస్ మాజీ ప్రెసిడెంట్ కలిగోట్ గంగాధర్, కల్లెడ సర్పంచ్ లావణ్య, ఆమె భర్త ప్రసాద్ గౌడ్, మాక్లూర్ మండలం నుంచి మాజీ  జడ్పీటీసీలు, మాజీ సర్పంచులు, ఉపసర్పంచులు బీజేపీలో చేరారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి, మాక్లూర్ మండలాధ్యక్షుడు సురేశ్​నాయక్, స్టేట్ బీజేపీ కౌన్సిల్ మెంబర్ విజయ భారతి, ఆర్మూర్ అసెంబ్లీ కన్వీనర్ పాలెపు రాజు, జెస్సు అనిల్ పాల్గొన్నారు.