
ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ నేడు బద్రీనాథ్ దేవాలయాన్ని సందర్శించారు. సతీమణి మధులికా రావత్ తో కలసి ఆయన గురువారం ఆలయంలోని విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయం చేరుకున్న రావత్ దంపతులకు అధికారులు ఘన స్వాగతం తెలిపారు. అంతకు ముందు రోజు వారిద్దరు కేదార్ నాథ్ లోని మహాశివున్ని దర్శించుకున్నారు. గత కొన్ని రోజుల నుంచి ఆర్మీ సేవల నుండి సెలవులో ఉన్న బిపిన్ రావత్.. భార్యతో కలిసి ఆధ్యాత్మిక యాత్రలు చేస్తున్నారు.