డ్రాగ‌న్ కంట్రీకి స‌రైన‌ రిప్ల‌య్ ఇస్తాం

డ్రాగ‌న్ కంట్రీకి స‌రైన‌ రిప్ల‌య్ ఇస్తాం

LOC వెంబడి గతేడాది కంటే పరిస్థితులు బాగున్నాయన్నారు ఆర్మీ చీఫ్ ఎం.ఎం నరవాణె. సరిహద్దు దగ్గర పాకిస్థాన్ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తుందన్నారు. 3వందల నుంచి 4వందల మంది టెర్రరిస్టులు భారత్ లోకి చొరబడేందుకు వేచి ఉన్నారన్నారు. దేశ సరిహద్దుల్లో పరిస్థితులను ఏకపక్షంగా మార్చే కుయుక్తులను ఎదుర్కోవడానికి భారత సైన్యం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు నరవాణె. భారత్  ఎప్పుడూ శాంతినే కోరుకుంటుందన్నారు. ఆర్మీ డే వేడుకల్లో పరోక్షంగా చైనాను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. భారత్ -చైనా మధ్య 14వ సమావేశం జరిగిందని.. ఇంకా కొన్ని అంశాలపై స్పష్ట రాలేదన్నారు.

 

మరిన్ని వార్తల కోసం...

కంగనా రనౌత్ చెంపల కంటే సున్నితంగా రోడ్లు