సీడీఎస్ బిపిన్ రావత్ హెలికాప్టర్ క్రాష్: లైవ్ అప్డేట్స్

సీడీఎస్ బిపిన్ రావత్ హెలికాప్టర్ క్రాష్: లైవ్ అప్డేట్స్

తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ఆర్మీ చీఫ్ సీడీఎస్ బిపిన్ రావత్ మరణించారు. వీరు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూలడంతో అందులో ప్రయాణిస్తున్న వారిలో 13 మంది మృతిచెందారు. ఈ ఘటన నీలగిరిలోని కూనూరులో చోటు చేసుకుంది.

బతికున్నది ఈయనేనట

తమిళనాడులో కూలిన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రమాదంలో గాయపడి.. వెల్లింగ్టన్ మిలటరీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. 

హెలికాప్టర్ ప్రమాదంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ మృతి
తమిళనాడులో జరిగిన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో సీడీఎస్ బిపిన్ రావత్ మృతిచెందారు. ఈ రోజు ఉదయం తమిళనాడులోని వెల్లింగ్టన్ కు వెళ్తుండగా వీరు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూలిపోయింది. దాంతో హెలికాప్టర్ లోని 14 మంది మృత్యువాత పడ్డారు. ఆయన మృతిని నిర్దారిస్తూ.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ట్వీట్ చేసింది.

హెలికాప్టర్ నడిపింది ఈ పైలటే

తమిళనాడులో కూలిన ఆర్మీ హెలికాప్టర్ లో సీడీఎస్ బిపిన్ రావత్, ఆయన భార్యతో పాటు మరో 12 మంది ఉన్నారు. వీరిలో 13 మంది మృతి చెందారు. అయితే వీరంతా ప్రయాణించిన హెలికాప్టర్ ను వింగ్ కమాండర్ పృథ్వీ సింగ్ చౌహాన్ నడిపినట్లు సమాచారం. ఆయన 109 హెలికాప్టర్ యూనిట్ కు కమాండింగ్ ఆఫీసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

ప్రమాదంలో ముద్దయిన మృతదేహాలు
హెలికాప్టర్ ప్రమాదంలో వచ్చిన మంటలకు మృతదేహాలు ముద్దగా మారాయి. ఏ మృతదేహం ఎవరిదో గుర్తుపట్టడం కష్టంగా మారింది. దాంతో మృతుల కుటుంబసభ్యుల డీఎన్ఏ సేకరించి.. దాని ద్వారా మృతదేహాలను గుర్తించారు. 

బతికున్న ఆ ఒక్కరు ఆయనేనా?

తమిళనాడులో కూలిన హెలికాప్టర్ ప్రమాదంలో 14 మందికి గాను 13 మంది మరణించినట్లు అధికారులు ధృవీకరించారు. అయితే వారిలో బతికున్న ఆ ఒక్కరు ఎవరనేదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. బతికున్నది రావతేనా అని ఊహాగానాలు వస్తున్నాయి. కాగా.. తీవ్రంగా గాయపడిన ఆ ఒక్కరికి 90 గాయాలైనట్లు తెలుస్తోంది. 

ప్రధాని అధ్యక్షతన అత్యవసర భేటీ

ఆర్మీ హెలికాప్టర్ కూలడంతో కేంద్రం అప్రమత్తమైంది. ప్రధాని మోడీ అధ్యక్షతన సాయంత్రం 6.30 గంటలకు భద్రతపై కేబినెట్ కమిటీ అత్యవసరంగా భేటీ కానుంది.

13 మంది చనిపోయినట్లు అధికారిక ప్రకటన

తమిళనాడు హెలికాప్టర్ ప్రమాదంలో 13 మంది చనిపోయినట్లుగా విశ్వసనీయ సమాచారం. మృతదేహాలకు డీఎన్ఏ టెస్ట్ చేసి మృతదేహాలను గుర్తించారు. కాగా.. చనిపోయిన వారిలో రావత్ లేనట్లుగా తెలుస్తోంది. ఆయనకు తీవ్ర గాయాలు కావడంతో ఆర్మీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తోన్నట్లు సమాచారం.

ప్రమాదంపై పార్లమెంటులో రేపు ప్రకటన

కూనూరులో జరిగిన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంపై రేపు పార్లమెంటులో అధికారిక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది.

బిపిన్ రావత్ ఇంటికి రాజ్ నాథ్

ఆర్మీ హెలికాప్టర్ కూలిపోవడంతో బిపిన్ రావత్ ఇంటికి రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ వెళ్లారు. పరిస్థితి గురించి ఆయన కుటంబసభ్యులతో మాట్లాడి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

ప్రమాద స్థలికి చేరుకున్న ఎయిర్ ఫోర్స్ చీఫ్
ఆర్మీ హెలికాప్టర్ కూలిన ప్రాంతానికి ఎయిర్ ఫోర్స్ చీఫ్ వీఆర్ చౌదరీ చేరుకున్నారు. ఘటనాస్థలంలో ప్రమాద దృశ్యాలను పరిశీలించనున్నారు.

ప్రమాదంపై ప్రత్యక్ష సాక్షి మాటలు

కూనూరులో కూలిన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంపై స్థానికులు స్పందించారు. ఓ ప్రత్యక్ష సాక్షి మాట్లాడుతూ.. ‘నేను ఇంట్లో ఏదో పనిలో ఉన్నాను. ఒక్కసారిగా పెద్ద శబ్దం వచ్చింది. దాంతో బయటకు వచ్చి చూసే సరికి హెలికాప్టర్ చెట్లను తాకుతూ కూలిపోయింది. నేను చూస్తుండగానే ఇద్దరు వ్యక్తులు మంటలంటుకొని హెలికాప్టర్ నుంచి బయటకు వచ్చి కుప్పకూలారు. దగ్గరికి వెళ్దామనుకుంటే.. బాగా మంటలు, పొగ ఉండటంతో భయంతో అక్కడికి వెళ్లలేకపోయాను’ అని ఆ వ్యక్తి చెప్పాడు.

14 మందిలో 13 మంది మృతి!

హెలికాప్టర్ లోని 14 మందిలో 13 మంది మృతిచెందినట్లు తెలుస్తోంది. చనిపోయిన వారిలో రావత్ భార్య మధులిక కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే రావత్ కు తీవ్ర గాయాలయ్యాయని.. ఆయనను ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. కాగా.. రావత్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది

రావత్ షెడ్యూల్ ఇలా ఉంది

వెల్లింగ్టన్ లో జరిగే ఆర్మీ అధికారిక కార్యక్రమంలో పాల్గొనేందుకు రావత్, ఆయన భార్య, మరో 12 మందితో కలిసి 11:47కు బయలుదేరారు. ఆ తర్వాత వాతావరణం అనుకూలించకపోవడంతో 12: 27 హెలికాప్టర్ కూలిపోయింది. రావత్ ఆర్మీ అధికారిక కార్యక్రమంలో మధ్యాహ్నం 2:40 గంటలకు మాట్లాడాల్సి ఉంది.

పార్లమెంట్ కు చేరుకున్న రాజ్ నాథ్

కూలిన ఆర్మీ హెలికాప్టర్ ఘటనపై రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పార్లమెంట్ లో ప్రకటన చేయనున్నారు. అందులో భాగంగా ఆయన పార్లమెంట్ సౌత్ బ్లాక్ కు చేరుకున్నారు. కేబినెట్ సమావేశంలో ఈ ఘటన గురించి మాట్లాడిన తర్వాత ఘటనాస్థలానికి వెళ్లనున్నట్లు సమాచారం.

ఘటనాస్థలానికి తమిళనాడు సీఎం స్టాలిన్

ఆర్మీ హెలికాప్టర్ కూలిపోయిన ప్రమాద స్థలానికి తమిళనాడు సీఎం స్టాలిన్ సాయంత్రం 5 గంటలకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. 

5 మృతదేహాల తరలింపు

ప్రమాదంలో అక్కడికక్కడే అయిదుగురు చనిపోయినట్లు తెలుస్తోంది. అయితే వారు ఎవరనేది ఇంకా తెలియలేదు. చనిపోయిన వారి మృతదేహాలను వెల్లింగ్టన్ ఎయిర్ బేస్ ఆస్పత్రికి తరలించారు.

కూలిన ఆర్మీ హెలికాప్టర్ లో ఉన్నది వీళ్లే!

1. త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్
2. రావత్ భార్య మధులిక రావత్
3. బ్రిగేడియర్ ఎల్ఎస్ లిద్దర్
4. లెఫ్టినెంట్ కల్నల్ హర్జిందర్ సింగ్
5. ఎన్ కే గురుసేవక్ సింగ్
6. ఎన్ కే జితేంద్ర
7. లాన్స్ నాయక్ వివేక్ కుమార్
8. లాన్స్ నాయక్ సాయి తేజ
9. హవల్దార్ సత్పాల్

 

ప్రధానికి ప్రమాదం గురించి వివరించిన రాజ్ నాథ్ సింగ్

తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. ఆర్మీకి చెందిన హెలికాప్టర్ నీలగిరిలోని కూనూరులో కూలిపోయింది. ప్రమాద సమయంలో హెలికాప్టర్ లో ఉన్నవారిలో ఎంతమంది ప్రాణాలు కోల్పోయారనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. కాగా.. రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రమాదం గురించి ప్రధాని మోడీకి వివరించారు.

సీడీఎస్ ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ హెలికాప్టర్ క్రాష్

తమిళనాడులోఘోర ప్రమాదం జరిగింది. ఆర్మీకి చెందిన హెలికాప్టర్ కూలింది. నీలగిరిలోని కూనూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు మరణించినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో హెలికాప్టర్ లో ఆర్మీకి చెందిన సీనియర్ అధికారులు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనలో ముగ్గురు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వారిని వెంటనే చికిత్స నిమిత్తం విల్లింగ్టన్ బేస్ కు తరలించారు ఆస్పత్రికి తరలించారు. హెలికాఫ్టర్ లో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ ఉన్నట్లు ఎయిర్ ఫోర్స్ అధికారులు కూడా తెలిపారు. రావత్ తోపాటు ఆయన భార్య ఆర్మీకి చెందిన మరో ముగ్గురు టాప్ అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. కూనూరు ఎయిర్ బేస్ నుంచి కోయంబత్తూరు ఎయిర్ బేస్ కు వెళ్తుండగా హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. 

హెలికాప్టర్ లో మొత్తం 14మంది ఉన్నట్లు ప్రముఖ న్యూస్ ఏజెన్సీ సంస్థ ఏఎన్ఐ పేర్కొంది. చాపర్ లోచీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా ఉన్నట్లు తెలిపింది. ప్రమాదం జరిగిన సమయంలో వెంటనే ఆర్మీ అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు. ఇద్దరికీ తీవ్రగాయాలు కావడంతో వారిని హుటా హుటిన ఆస్పత్రికి తరలించారు. సాంకేతిక కారణాలతోనే హెలికాప్టర్ ప్రమాదం జరిగినట్లు తెలిపింది. ఘటన జరిగిన వెంటనే స్థానికులు గుర్తించి 80శాతం కాలిన గాయాలతో ఉన్న ఇద్దర్ని గుర్తించి వెంటనే ఆస్పత్రికి తరలించారు. మరోవైపు ఈ ప్రమాదంపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విచారణకు ఆదేశించింది.  కూలిన హెలికాప్టర్ MI -17 V5 గా ఇండియన్‌ ఎయిర్ ఫోర్స్‌ ప్రకటించింది. 

ఊటీలో ఓ సమ్మిట్ లో పాల్గొనేందుకు రావత్ వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. వాతావరణం సరిగా లేకపోవడం వల్లనే హెలికాప్టర్ క్రాష్ జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారిస్తున్నారు. చాపర్ లో రావత్‌తో పాటు ఆయన భార్య మధులిక రావత్‌ కూడా ఉన్నారు. ఇంకా బ్రిగేడియర్‌ ఎల్‌ఎస్‌ లిద్దర్‌, లెఫ్టెనెంట్ కర్నల్‌ హర్జిందర్‌ సింగ్‌, ఎన్‌కే గురుసేవక్‌ సింగ్‌, జితేంద్ర కుమార్‌, వివేక్‌ కుమార్‌, సాయితేజ, హావల్దార్ సత్పాల్‌ ఉన్నారు.