అత్తారింటికి వెళ్లొచ్చి.. రైల్వే ట్రాక్పై శవమై తేలాడు.. యాదాద్రి జిల్లాలో ఆర్మీ జవాన్ మృతి

అత్తారింటికి వెళ్లొచ్చి.. రైల్వే ట్రాక్పై శవమై తేలాడు.. యాదాద్రి జిల్లాలో ఆర్మీ జవాన్ మృతి

దసరా పండుగకు అత్తారింటికి వెళ్లొచ్చిన ఆర్మీ జవాన్ రైల్వే పట్టాలపై శవమై కనిపించడం యాదాద్రి భువనగిరి జిల్లాలో కలకలం రేపింది. భువనగిరి పట్టణంలోని జగదేవ్ పూర్ ఫ్లైఓవర్ సమీపంలో రైల్వే ట్రాక్ పై కరుణాకర్ అనే ఆర్మీ జవాన్ మృతదేహాన్ని గుర్తించారు. సోమవారం (అక్టోబర్ 06) రాత్రి ట్రైన్ కింద పడి చనిపోయినట్లు పోలీసులు నిర్ధారించారు. 

 బొమ్మల రామరం (మ) మేడిపల్లి గ్రామానికి చెందిన కరుణాకర్.. అస్సాంలో ఆర్మీలో విధులు నిర్వహిస్తున్నాడు. దసరా సెలవుల కోసం స్వగ్రామానికి వచ్చి చనిపోవడంపై కుటంబ సభ్యులు గుండెలు బాదుకునేలా ఏడుస్తున్నారు. పడుగకు అత్తగారింటికి ప్రతాప్ సింగారం వెళ్లి వచ్చిన కరుణాకర్ రైల్వే ట్రాక్ పైన పడి చనిపోయాడు. మృతికి వివరాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.