
- 20 కి.మీ. రన్నింగ్ లో డీ హైడ్రేషన్ కు లోనై చికిత్స పొందుతూ మృతి
బజార్ హత్నూర్, వెలుగు: ఆర్మీ ట్రైనింగ్ లో భాగంగా 20 కి.మీ. రన్నింగ్ చేస్తూ బజార్ హత్నూర్ మండలానికి చెందిన ఆర్మీ జవాన్ మృతి చెందాడు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. వర్తమన్నూర్ గ్రామానికి చెందిన నలువల ఆకాశ్(23) అస్సాంలో రైఫెల్స్ రెజిమెంట్‌లో ఐదు నెలలుగా శిక్షణ పొందుతున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పటికే 5 కి.మీ. 10కి.మీ. రన్నింగ్పూర్తిచేశాడు. శనివారం 20 కి.మీ. రన్నింగ్ చేస్తుండగా డీహైడ్రేషన్‌కు గురయ్యాడు. ఆర్మీ అధికారులు అతడిని వెంటనే మిలిటరీ హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందించారు.
చికిత్స పొందుతూ సోమవారం చనిపోయినట్లు ఆర్మీ అధికారులు కుటుంబ సభ్యులకు తెలియజేశారు. దేశ సేవ కోసం వెళ్లిన కొద్ది కాలానికే ఇలా తిరిగిరాని లోకాలకు వెళ్లాడని కుటుంబ సభ్యులు, బంధువులు బోరున ఏడ్చారు. మృతుడికి తల్లి, తండ్రి, తమ్ముడు ఉన్నారు.