డోంట్ వర్రీ : తమిళనాడులో దిగిన సైన్యం.. 20 వేల మందికి రక్షణ

డోంట్ వర్రీ : తమిళనాడులో దిగిన సైన్యం.. 20 వేల మందికి రక్షణ

తమిళనాడు రాష్ట్రం భారీ వర్షాలతో అల్లాడిపోతుంది. చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో.. వర్షాలు పడుతుండటంతో.. లక్షల మంది వరదలో చిక్కుకున్నారు. ముఖ్యంగా తమిళనాడు దక్షిణ ప్రాంతం అయిన వైకుంఠం పట్టణం వారం రోజులుగా వరదలోనే ఉంది... తాంబరభరణి నది నుంచి లక్షా 50 వేల క్యూసెక్కుల నీటి విడుదలతో.. వైకుంఠం పట్టణం నీటి మునిగింది. ఈ పట్టణానికి మిగతా ప్రపంచంలో సంబంధాలు తెగిపోయాయి. కనీసం పాలు, నీళ్లు కూడా అందించలేని పరిస్థితుల్లో ఉంది సర్కార్. ఈ క్రమంలోనే.. వైకుంఠం పట్టణంలో వరద ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు.. వారికి సాయం చేసేందుకు.. సైన్యం రంగంలోకి దిగుతుంది. ప్రస్తుతం ఎన్డీఆర్ఎఫ్, రాష్ట్ర ప్రభుత్వ సహాయ బృందాలు చేస్తున్న రెస్క్యూ ఆపరేషన్ సరిపోకపోవటంతో.. భారత సైన్యాన్ని రంగంలోకి దించుతుంది కేంద్ర ప్రభుత్వం.

ఐదు వేల మంది సైన్యం.. ఇప్పుడు తమిళనాడు రానున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆర్మీకి చెందిన హెలికాఫ్టర్లు, విమానాలతో వైకుంఠం ప్రాంతంలో చిక్కుకున్న వారికి.. ఆహార పొట్లాలు, మంచినీళ్లు, వైద్య సహాయం అందించాలని నిర్ణయించింది తమిళనాడు సర్కార్. వైకుంఠం పట్టణంలోని వరద పూర్తిగా తగ్గటానికి మరికొన్ని రోజుల సమయం పడుతుందని.. 20 వేల మంది వరద బాధితులు సాధారణ స్థితికి వచ్చే వరకు సైన్యం సాయం తీసుకుంటున్నట్లు ఆ జిల్లా కలెక్టర్ ప్రకటించారు. 

వైకుంఠంతోపాటు.. తమిళనాడులో వరద, వర్షాలకు జరిగిన నష్టం వేల కోట్లు ఉంటుందని.. తక్షణ సాయంగా 2 వేల కోట్లను డీఎంకే సర్కార్ విడుదల చేసింది. ముందు బాధితులను ఆదుకోవటం అనేది తక్షణ కర్తవ్యం అని స్పష్టం చేసింది. సైన్యం రాకతో.. బాధితులకు వేగంగా సాయం అందుతుందని.. వర్షాలు తగ్గిన వారం రోజుల్లో సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు ప్రకటించింది తమిళనాడు ప్రభుత్వం.