బోర్డర్‌‌లో పాక్‌ కాల్పులు.. జవాను మృతి

బోర్డర్‌‌లో పాక్‌ కాల్పులు.. జవాను మృతి
  • కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాక్‌
  •  ఒక టెర్రరిస్ట్‌ హతం

శ్రీనగర్‌‌: జమ్మూకాశ్మీర్‌‌లో బోర్డర్‌‌లో పాకిస్తాన్‌ ఆర్మీ పదే పదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది. రజౌరి జిల్లా సందర్‌‌బన్‌లో గురువారం అర్ధరాత్రి పాకిస్తాన్‌ ఆర్మీ జరిపిన కాల్పుల్లో ఒక సైనికుడు అమరుడయ్యాడు. పాకిస్తాన్‌ ఆర్మీ రాత్రి 10 :45 గంటలకు ఒక్కసారిగా కాల్పులకు దిగిందని అధికారులు అన్నారు. పూంచ్‌ జిల్లాల్లో కూడా కాల్పులు జరిపినట్లు ఆర్మీ అధికారులు చెప్పారు. లైన్‌ ఆఫ్‌ కంట్రోల్‌ దగ్గర్లోని కిర్నీ సెక్టార్‌‌లో మోర్టార్‌‌లతో దాడి చేశారని, మన ఆర్మీ వారిని సమర్థంగా తిప్పికొట్టిందని చెప్పారు. రజౌరి జిల్లాలోని కలాకోటేలో ఒక టెర్రరిస్టులనుసెక్యూరిటీ ఫోర్స్‌ మట్టుబెట్టారని, మరో ముగ్గురు ఉన్నట్లు అనుమానంతో పెద్ద ఎత్తున సెర్చ్‌ ఆపరేషన్ నిర్వహించామని ఆర్మీ అధికార ప్రతినిధి చెప్పారు. కలాకోటేలో టెర్రరిస్టులు ఉన్నారనే సమాచారంతో సెర్చ్‌ ఆపరేషన్ నిర్వహించగా ఎదురుకాల్పులు జరిగాయని అన్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా జమ్మూకాశ్మీర్‌‌లో విధించిన లాక్‌డౌన్ సమయంలో టెర్రరిస్టుల చొరబాట్లు ఎక్కువయ్యాయని, దాడులకు కూడా పెద్ద ఎత్తున ప్లాన్‌ చేసుకున్నారని పోలీసులు చెప్పారు. రెండు నెలల నుంచి పాకిస్తాన్‌ కూడా ఎల్‌వోసీ వెంట తరచూ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది.