Aron Finch: అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన ఆస్ట్రేలియా కెప్టెన్

Aron Finch: అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన ఆస్ట్రేలియా కెప్టెన్

ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్ మెన్, మాజీ టీ20 కెప్టెన్ ఆరోన్ ఫించ్ సంచలన ప్రకటన చేశాడు. ఇవాళ అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలుకుతున్నట్లు తెలిపాడు. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసింది. పోయిన ఏడాది సెప్టెంబర్ లో వన్డే క్రికెట్ నుంచి తప్పుకున్న ఫించ్.. ఇప్పుడు టీ20 క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. టీ20 కెప్టెన్ గా బాధ్యతలు అందుకొని ఆస్ట్రేలియాకు మొదటి టీ20 ప్రపంచకప్ అందించాడు. 

ఈ విషయంపై మాట్లాడిన ఫించ్.. ‘2024 జరగబోయే టీ20 ప్రపంచకప్ వరకు నేను ఆడలేకపోవచ్చని అర్థమైంది. ఫిట్ నెస్ సాధించలేకపోతున్నా. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకోవడానికి ఇదే సరైన సమయం అనిపించింది. దీనివల్ల కుర్రాళ్లకు అవకాశాలు దక్కుతాయి. నాకు మద్దతుగా నిలిచిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు. నా నిర్ణయంలో ఎవరి ఒత్తిడి లేదు’ అని చెప్పుకొచ్చాడు. 

ఫించ్ కెరీర్ లో అన్ని ఫార్మాట్లలో కలిపి 254 మ్యాచులు ఆడాడు. 8804 పరుగులు చేశాడు. అందులో 19 సెంచరీలు ఉన్నాయి. టీ20ల్లో అత్యధిక స్కోరు ఫించ్ (172) పేరుమీదే ఉంది. 2014,2018లో టీ20 ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ గా ఎంపికయ్యాడు. 2015 వన్డే వరల్డ్ కప్ ను కూడా ముద్దాడాడు.

మరిన్ని వార్తలు