
హనుమకొండ సిటీ, వెలుగు : యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ట్రైనింగ్ ప్లేస్మెంట్ సెల్ ఆధ్వర్యంలో ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకుతో ఎంఓయూ కుదుర్చుకున్నట్లు ఆకళాశాల ప్రిన్సిపాల్, ప్రొఫెసర్ సుంకరి జ్యోతి తెలిపారు. బుధవారం కళాశాలలో ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు అధికారులతో సమావేశయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎంవోయూ ద్వారా ఆర్ట్స్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు నగరంలో హనుమకొండ పోస్ట్ ఆఫీస్ ల్లో పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు ద్వారా ఇంటర్షిప్ పొందే అవకాశం ఉంటుందన్నారు.
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు డీహెచ్ఎస్ హనుమకొండ బ్రాంచ్ ద్వారా ఈ ట్రైనింగ్ పూర్తి చేసిన విద్యార్థులకు ఇంటర్షిప్ సర్టిఫికెట్ అందజేస్తామని వివరించారు. కార్యక్రమంలో యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ అధికారి డాక్టర్ ఎల్.జితేందర్, వైస్ ప్రిన్సిపాల్ ఎస్ఎం రెహమాన్ తోపాటు ఫిజిక్స్ ఇన్చార్జి డాక్టర్ వరలక్ష్మి, డాక్టర్లు సరిత, బి.సరిత, ప్రశాంత్, గిరి పాల్గొన్నారు.