
ప్రపంచవ్యాప్తంగా భారీ క్రేజ్ ఉన్న క్రికెట్ ప్రస్తుతం కమర్షియల్ అయిపోయింది. చాలా మంది ఆటగాళ్లు దేశం కంటే డబ్బుకే ఎక్కువ విలువ ఇస్తున్నారు. దేశం తరుఫున ఆడితే తక్కువ డబ్బు వస్తుందని.. ఫ్రాంచైజ్ క్రికెట్ ఆడేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇలాంటి తరుణంలో ఆస్ట్రేలియా క్రికెటర్స్ ప్యాట్ కమిన్స్, ట్రావిస్ హెడ్ తమకు దేశం కంటే ఎక్కువ ఏదని లేదని నిరూపించారు. తమకు డబ్బు కంటే దేశమే ఫస్ట్ అని చాటిచెప్పారు. కోటి కాదు.. రెండు కోట్లు కాదు.. ఏకంగా రూ.58 కోట్ల భారీ ఆఫర్‌ను దేశం కోసం తృణప్రాయంగా వదిలేశారు కమిన్స్, హెడ్.
ఆస్ట్రేలియా క్రికెటర్స్ ప్యాట్ కమిన్స్, ట్రావిస్ హెడ్ ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరుఫున ఆడుతోన్న విషయం తెలిసిందే. ప్యాట్ కమిన్స్ ఎస్ఆర్హెచ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలో.. కమిన్స్, హెడ్‌కు ఓ ఐపీఎల్ ఫ్రాంచైజ్ భారీ ఆఫర్ ఇచ్చింది. అదేందంటే.. కమిన్స్, హెడ్ ఇద్దరూ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికి.. తమ జట్టు తరుఫున ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫ్రాంచైజ్ క్రికెట్ లీగ్‌లలో ఆడాలి.
►ALSO READ | గంభీర్ పాత్ర ఏం లేదు.. ఆ క్రెడిట్ రాహుల్ ద్రవిడ్ దే .. సైలెన్స్ బ్రేక్ చేసిన రోహిత్ శర్మ
ఇందుకోసం ఒక్కొక్కరికి సంవత్సరానికి 10 మిలియన్ డాలర్లు చెల్లిస్తామని సదరు ఫ్రాంచైజ్ ఆఫర్ ఇచ్చింది. 10 మిలియన్ డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ.58 కోట్లు. అంటే.. కమిన్స్, హెడ్ ఆస్ట్రేలియాకు వీడ్కోలు పలికి తమ టీమ్ తరుఫున ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫ్రాంచైజ్ లీగులు ఆడితే ఒక్కొక్కరికి రూ.58 కోట్లు చెల్లిస్తామని ఆఫర్ ఇచ్చింది ఆ ఐపీఎల్ ఫ్రాంచైజ్. కానీ ఐపీఎల్ ఫ్రాంచైజ్ ఇచ్చిన ఈ బిగ్ డీల్‌ను కమిన్స్, హెడ్ దేశం కోసం సున్నితంగా తిరస్కరించారు.
తమకు డబ్బు కంటే దేశమే ఫస్ట్ అని దేశభక్తి చాటారు. కాగా, ఆస్ట్రేలియా తరుఫున ఆడితే సెంట్రల్ కాంట్రాక్ట్ కింద కమిన్స్, హెడ్‌కు ఏడాదికి దాదాపు రూ.8 కోట్లు వస్తాయి. అదే ఐపీఎల్ ప్రాంచైజ్ ఇచ్చిన ఆఫర్‌కు ఒకే చెబితే సంవత్సరానికి రూ.58 కోట్లు ఆర్జించవచ్చు. కానీ దేశం కోసం రూ.50 కోట్లను తృణప్రాయం వదులుకోని గ్రేట్ అని నిరూపించుకున్నారు కమిన్స్, హెడ్.