భూభారతి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి : కలెక్టర్ డాక్టర్ సత్యశారద

భూభారతి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి : కలెక్టర్ డాక్టర్ సత్యశారద

నర్సంపేట, వెలుగు : భూభారతి దరఖాస్తులను పరిశీలించి రైతుల భూ సమస్యలను పరిష్కరించాలని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. బుధవారం అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి తో కలిసి నర్సంపేట ఆర్డీవో కార్యాలయాన్ని కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా రెవెన్యూ డివిజన్​లోని 6 మండలాల తహసీల్దార్లు, రెవెన్యూ సిబ్బందితో భూభారతి అమలుపై సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తుల్లో ఎన్ని అర్జీలు పరిష్కరించారు ? ఎన్ని పెండింగ్ లో ఉన్నాయి? అనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. 

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిర్ణీత గడువులోపు అన్ని దరఖాస్తులు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. దరఖాస్తులు తిరస్కరణకు గురైనట్టయితే అందుకు గల కారణాలు స్పష్టంగా పేర్కొనాలని సూచించారు. సాదాబైనామా, పీఓటీ లకు సంబంధించిన అప్లికేషన్ లను క్షుణ్ణంగా పరిశీలించాలని, వెంటనే నోటీసులు జారీ చేస్తూ క్షేత్రస్థాయిలో వెరిఫికేషన్ నిర్వహించాలన్నారు. భూభారతి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. సమావేశంలో ఆర్డీవో ఉమారాణి, తహసీల్దార్లు రవిచంద్ర రెడ్డి, రాజేశ్వరరావు, రాజ్ కుమార్, అబిడ్ అలీ, రమేశ్, కృష్ణా, సిబ్బంది పాల్గొన్నారు.

ఎన్నికల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి 

నర్సంపేట, వెలుగు : స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని వరంగల్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. బుధవారం నర్సంపేట మండల కేంద్రంలో ఎంపీడీవో ఆఫీసులో ఏర్పాటు చేసిన నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్నికల సామాగ్రి,  రిటర్నింగ్, సహాయ అధికారి స్వీకరణ గదులు, జనరల్ అబ్జార్వర్, వ్యయ పరిశీలకుల గదులను పర్యవేక్షించారు. 

నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ పారదర్శకంగా సజావుగా జరగాలని, పాటించాల్సిన విధానాలు, ప్రజలకు అందుబాటులో ఉండే సౌకర్యాలపై సమీక్షించారు. అనంతరం నర్సంపేట ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో నిర్మిస్తున్న మోడల్ ఇందిరమ్మ  ఇండ్ల నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు. ఆమె వెంట జడ్పీ సీఈవో రామిరెడ్డి, డీపీవో కల్పన, ఆర్డీవో ఉమారాణి, ఎంపీడీవో శ్రీనివాస్ రావు తదితరులు  ఉన్నారు.