మేరీ ల్యాండ్ లెఫ్టినెంట్ గవర్నర్గా అరుణ మిల్లర్

మేరీ ల్యాండ్ లెఫ్టినెంట్ గవర్నర్గా అరుణ మిల్లర్

వాషింగ్టన్ : భారత సంతతికి చెందిన అరుణ మిల్లర్ చరిత్ర సృష్టించారు. అమెరికాలోని మేరీ ల్యాండ్ స్టేట్ లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికయ్యారు. భారత సంతతికి చెందిన వ్యక్తి అమెరికాలో లెఫ్టినెంట్ గవర్నర్ కావడం ఇదే తొలిసారి. మంగళవారం జరిగిన మధ్యంతర ఎన్నికల్లో అరుణా మిల్లర్ విజయం సాధించడంతో ఈ పదవి దక్కింది.

58 ఏళ్ల అరుణ మిల్లర్ వెస్ మూర్.. మేరీ ల్యాండ్లోని డెమొక్రాటిక్ గవర్నర్గా ఎన్నికయ్యారు. గవర్నర్ తర్వాత లెఫ్టినెంట్ గవర్నర్ అత్యున్నత హోదా కాగా.. గవర్నర్ విధులు నిర్వర్తించలేని సమయంలో వారు బాధ్యతలు చూసుకుంటారు. అరుణ మిల్లర్ ఆంధ్రప్రదేశ్లో జన్మించగా.. 1972లో ఆమె పేరెంట్స్ అమెరికా వలస వెళ్లారు.