ఢిల్లీ హైకోర్టు స్టేపై సుప్రీం కోర్టుకు కేజ్రీవాల్

ఢిల్లీ హైకోర్టు స్టేపై  సుప్రీం కోర్టుకు కేజ్రీవాల్

ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. బెయిల్ పై ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన స్టేపై సుప్రీంను ఆశ్రయించారు. రౌస్ ఎవెన్యూ కోర్టు ఇచ్చిన ఆర్డర్స్ ను కంటిన్యూ చేయాలని పిటిషన్ వేశారు. జూన్ 24న విచారించాలని కేజ్రీవాల్ తరపు న్యాయవాదులు కోరారు. 

లిక్కర్ స్కాంలో  రౌస్ అవెన్యూ కోర్టు ఇటీవల కేజ్రీవాల్ కు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. అయితే దీనిపై ఈడీ అభ్యంతరం చెప్తూ హైకోర్టును ఆశ్రయించగా.. రౌస్ అవెన్యూ కోర్టు ఆర్డర్స్ పై హైకోర్టు స్టే విధించింది. దీంతో సుప్రీం కోర్టు తలుపుతట్టారు కేజ్రీవాల్. 

లిక్కర్ స్కాం కేసులో  మార్చి 21న అరెస్ట్ అయిన కేజ్రీవాల్ ఇటీవల లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో మద్యంతర బెయిల్ పై బయటకు వచ్చాడు. తర్వాత జూన్ 2న కోర్టులో లొంగిపోయాడు.