100 కొత్త బస్సులను ప్రారంభించిన ఢిల్లీ సీఎం

100 కొత్త బస్సులను ప్రారంభించిన ఢిల్లీ సీఎం

న్యూ ఢిల్లీ: క్లస్టర్ పథకం కింద హైడ్రాలిక్ లిఫ్టులు, సీసీటీవీ కెమెరాలు, ప్యానిక్ బటన్ ఉన్న 100 స్టాండర్డ్ ఫ్లోర్ బస్సులను ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రారంభించారు. గురువారం ఢిల్లీలోని రాజ్​ఘాట్ బస్ డిపోలో జెండా ఊపి ప్రారంభించిన ఆయన .. వచ్చే ఆరు..ఏడు నెలల్లో 1,000 ఎలక్ట్రిక్ బస్సులతో సహా 3 వేల బస్సులను ఢిల్లీ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ లో చేర్చుతామని చెప్పారు. బస్సు డిపోలకు స్థలం లేకపోవడంతోనే కొత్త బస్సులను తీసుకురావడానికి టైం పట్టిందని, ఇప్పుడు అవన్నీ సర్దుబాటు అయ్యాయని తెలిపారు. ఎడ్యుకేషన్, హెల్త్ కేర్ హబ్ గా ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఢిల్లీ త్వరలోనే స్ట్రాంగ్ అండ్ హెల్తీ బస్ సిస్టమ్ కలిగిఉన్న ప్రభుత్వంగా రికార్డులకెక్కుందని అన్నారు.ఈ బస్సుల చేరికతో ఢిల్లీ ఇంటిగ్రేటెడ్ మల్టీ మోడల్ సిస్టమ్ నడుపుతున్న బస్సుల సంఖ్య 1904కు చేరింది.