ఒమిక్రాన్‌ ఎఫెక్ట్: హెల్త్ స్టాఫ్, మెడిసిన్‌ స్టాక్ పెంచుతున్నం

ఒమిక్రాన్‌ ఎఫెక్ట్: హెల్త్ స్టాఫ్, మెడిసిన్‌ స్టాక్ పెంచుతున్నం

రోజుకు లక్ష కేసులు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యామన్నారు ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్. ఢిల్లీలో ఒమిక్రాన్ కేసులు వేగంగా పెరుగుతుండడం, దేశంలోనే మహారాష్ట్ర తర్వాత అత్యధికంగా ఇక్కడ 64 కేసులు నమోదైన నేపథ్యంలో పరిస్థితిపై అధికారులతో రివ్యూ చేశారు కేజ్రీ. రోజుకు 3 లక్షల టెస్టులు చేసే కెపాసిటీ ఉందన్నారు. తక్కువ లక్షణాలు ఉన్నవారు ఇళ్లలోనే ఉండాలని.. హాస్పిటల్స్ కు పరుగులు పెట్టొద్దని కేజ్రీవాల్ కోరారు. హోం ఐసోలేషన్‌లో ఉన్నవారికి ప్రభుత్వ హెల్త్ కేర్ వర్కర్లు వచ్చి ట్రీట్మెంట్ ఇస్తారని, అలాగే కరోనా కిట్ కూడా ఇస్తారని చెప్పారు. ఒమిక్రాన్ ను  ఎదుర్కొనేందుకు మ్యాన్ పవర్, మెడిసిన్ స్టాక్ పెంచుతున్నామని చెప్పారు. వచ్చే 3 వారాల్లో 15 ఆక్సిజన్ ట్యాంకర్లు తమకు అందుతాయన్నారు.

కాగా, దేశంలోనే అత్యధికంగా మహారాష్ట్రలో 88 ఒమిక్రాన్ కేసులు నమోదు కాగా, 64 కేసులతో రెండో స్థానంలో ఢిల్లీ ఉంది. ఈ నేపథ్యంలో కరోనా కట్టడి చర్యల్లో భాగంగా క్రిస్మస్ , న్యూఇయర్ సెలబ్రేషన్స్ పై  ఆంక్షలు విధించింది ఢిల్లీ ప్రభుత్వం. క్రిస్మస్,  న్యూఇయర్ సెలబ్రేట్  చేసుకునేందుకు జనం గుమిగూడడాన్ని  పూర్తిగా నిషేధించింది.  కల్చరల్ ఈవెంట్స్  సహా ఏ రకంగానూ   జనం ఒక్కచోట  చేరకుండా బ్యాన్  చేస్తూ ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్ మెంట్  అథారిటీ నోటిఫికేషన్  రిలీజ్ చేసింది. తమ ఆర్డర్స్ ఫాలో కావాలని జిల్లాల  అధికారులు, పోలీసులను  ఆదేశించింది. అలాగే జిల్లాల అధికారులు రోజువారీ   రిపోర్ట్స్ సబ్మిట్  చేయాలని ఆదేశించింది. మాస్క్ లేకపోతే కస్టమర్లను  అనుమతించకూడదని... మార్కెట్ ట్రేడ్ అసోసియేషన్లను  ఆదేశించింది.