ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు కల్పితం..ఇదంతా కుట్ర

 ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు కల్పితం..ఇదంతా కుట్ర

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరవింద్‌ కేజ్రీవాల్‌ను సీబీఐ  ఏప్రిల్ 16వ తేదీన విచారించింది. దాదాపు తొమ్మిది గంటల పాటు సీబీఐ అధికారులు ప్రశ్నించారు. అయితే ఈ కేసులో సీబీఐ తనను 56 ప్రశ్నలు అడిగినట్లు అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. వారి ప్రశ్నలకు గౌరవంగానే సమాధానం ఇచ్చినట్లు చెప్పారు. అసలు లిక్కర్ స్కాం కేసు అనేది బూటకమని..ఇదంతా కల్పితమే అని కేజ్రీవాల్ తెలిపారు. 

ఏమేమీ ప్రశ్నలంటే..

లిక్క్ పాలసీ అమలులోకి వచ్చిన 2020 సంవత్సరం నుంచి తనను సీబీఐ అధికారులు ప్రశ్నలు అడిగినట్లు కేజ్రీవాల్ తెలిపారు. తన విచారణకు సంబంధించి ఏప్రిల్ 17వ తేదీన జరిగే అంసెబ్లీ సమావేశంలో మాట్లాడతానన్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీపై చేసిన ఆరోపణలన్నీ అవాస్తమన్నారు. అలసు లిక్కర్ పాలసీ కేసే అబద్ధమని..ఇది పూర్తిగా కల్పితమని చెప్పారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ నిజాయితీగల జాతీయ పార్టీ అని.. ఆప్‌ను లేకుండా చేయాలని కుట్ర జరుగుతోందన్నారు. నిజాయితే తమ సిద్ధామని...ఢిల్లీలో తాము చేస్తున్న మంచి..,అభివృద్ధి పనులు చూసి ఓర్వలేక ఆప్  పరువు తీసేందుకు ప్రయత్నిస్తున్నారని  ఆరోపించారు.

9 గంటల పాటు విచారణ...

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీబీఐ అధికారులు  కేజ్రీవాల్‌ను  9 గంటల పాటు విచారించారు. ఈ కేసులో తమ ఎదుట హాజరుకావాలని ఏప్రిల్14వ తేదీన ఆయనకు సీబీఐ సమన్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 16వ తేదీన కేజ్రీవాల్‌ సీబీఐ ఆఫీసుకు వచ్చారు. పొద్దున నుంచి  సీబీఐ అధికారులు కేజ్రీవాల్ ను సుదీర్ఘంగా విచారించారు.