
కంటైన్ మెంట్ జోన్లను వదిలేసి మిగిలిన అన్నీ ఏరియాల్లో లాక్ డౌన్ ఎత్తివేయాలని ప్రధాని మోడీని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కోరారు.
లాక్ డౌన్ పై ప్రధాని ఐదోసారి అన్నీ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియా కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ ఆర్ధిక సంక్షోభం నుంచి భయటపడాలంటే కంటైన్ మెంట్ జోన్లను వదిలేసి మిగిలిన అన్నీ ప్రాంతాల్లో లాక్ డౌన్ ను పూర్తిగా ఎత్తివేయాలని కోరారు.
అయితే ఢిల్లీ సీఎం వ్యాఖ్యలపై.. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్ష వర్ధన్ మాట్లాడుతూ అన్నీ ప్రాంతాల్లో కనీస సడలింపులకు మాత్రమే అనుమతి ఉంది. అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాల్లో కరోనా వైరస్ సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటే కఠిన చర్యలు అవసరమని అన్నరు.