తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర 16వ ఆర్థిక సంఘం పర్యటన జరుగుతుంది. ఇందులో భాగంగా సీఎం రేంవత్ రెడ్డి, మంత్రులతో ఫైనాన్స్ కమిషన్ తో మంగళవారం భేటీ అయ్యారు. రాష్ట్రం ఆర్థిక వ్యవస్థపై ఫైనాన్స్ కమిషన్ ఛైర్మన్ అర్వింద్ పణగారియా మీడియాతో మాట్లాడారు. అర్బన్ డెవలప్మెంట్ పై తెలంగాణ ఫోకస్ చేయడం అభినందనీయమన్నారు ఆయన.
అర్వింద్ పణగారియా పర్యటనలో భాగంగా తెలంగాణ వారికి ఆరో రాష్ట్రమన్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో చాలా పారదర్శకంగా చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. ఆయన తెలంగాణలో ఉన్న భవిష్యత్ ప్రణాళికలు ఫైనాన్స్ కమిషన్ ను ఆకర్శించిందన్నారు.
రాష్ట్రానికి ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కమిషన్ ను కోరారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ నిధులపై రాష్ట్రం ప్రభుత్వం నుంచి వినతులు వచ్చాయన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రవాటా నిధుల కేటాయింపుపై దృష్టి సారించామన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే వినతుల్లో ప్రజలకు ఉపయోగపడే పాలసీలను కేంద్రానికి సిఫార్సు చేస్తామన్నారు.
రాష్ట్ర అవసరాలను కమిషన్ దృష్టికి తీసుకెళ్లామని ఆర్థిక శాఖ మంత్రి భట్టీ విక్రమార్క అన్నారు. రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వ పథకాలను రూపొందించాలని కమిషన్ కు సూచించారు. ప్రత్యేక నిధులు రాష్ట్రానికి ఇవ్వాలని, తెలంగాణ ఆర్థికాభివృద్ధికి సహకరించాలని కమిషన్ ను కోరామన్నారు ఆర్థిక మంత్రి భట్టీ.
Arvind Panagariya, chairman of the 16th Finance Commission, said that Telangana focus on urban development is commendable