ఆర్యన్ ఖాన్ కి దక్కని బెయిల్.. విచారణ వాయిదా

ఆర్యన్ ఖాన్ కి దక్కని బెయిల్.. విచారణ వాయిదా

ఆర్యన్ ఖాన్, అర్బాజ్ మర్చంట్ మరియు మున్మున్ ధమేచాల బెయిల్ పిటిషన్‎లపై ముంబై కోర్టు విచారణను రేపటికి వాయిదా వేసింది. బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్‌పై ముంబై సెషన్స్ కోర్టు విచారణ జరిపింది. ఆర్యన్ ఖాన్ తరఫున న్యాయవాది అమిత్ దేశాయ్ వాదిస్తున్నారు. ఆర్యన్ వద్ద అసలు డబ్బులే లేవని.. అలాంటప్పుడు అతడు డ్రగ్స్ ఎలా కొనగలడని దేశాయ్ కోర్టుకు తెలిపారు. అందుకే ఆర్యన్ ఖాన్ కు బెయిల్ ఇవ్వాల్సిందిగా దేశాయ్ న్యాయమూర్తిని కోరారు. అసలు ఆర్యన్ ఖాన్ దగ్గర ఎటువంటి డ్రగ్స్ దొరకలేదని ఆయన నొక్కివక్కాణించారు. అర్బాజ్ మర్చంట్ దగ్గర పోలీసులు ఆరు గ్రాముల చరాస్ స్వాధీనం చేసుకున్నారని.. అది కూడా అమ్మడానికి కాదని.. అతడు తీసుకోవడానికి మాత్రమే తన దగ్గర ఉంచుకున్నాడని లాయర్ దేశాయ్.. జడ్జీకి తెలిపారు. అదేవిధంగా క్రూయిజ్ షిప్‎లో అసలు ఆర్యన్ ఖాన్ లేనే లేడని దేశాయ్ వాదించారు.

For More News..

వైరల్ వీడియో: బర్త్ డే రోజు 550 కేక్‎ల కట్

హుజూరాబాద్ బైపోల్.. బరి నుంచి 12 మంది విత్ డ్రా..

ఈ పాస్‎వర్డ్‎లు వాడితే ఈజీగా హ్యాక్ అవుతారు