Australian Open 2024: ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేతగా అరీనా సబలెంకా..ఫైనల్లో జెంగ్‌ చిత్తు

Australian Open 2024: ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేతగా అరీనా సబలెంకా..ఫైనల్లో జెంగ్‌ చిత్తు

ఆస్ట్రేలియన్ ఓపెన్ లో అద్బుతాలేమి జరగలేదు. అందరూ ఊహించినట్లుగానే  అరీనా సబలెంకా సీజన్ మొదటి గ్రాండ్ స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ గెలుచుకుంది. బెలారస్ స్టార్ 6-3, 6-2 వరుస సెట్లలో విజయం నమోదు చేసి మహిళల సింగిల్స్ టైటిల్‌ను నిలబెట్టుకుంది. ఫైనల్లో క్విన్వెన్ జెంగ్‌ కు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా వరుస సెట్లలో చిత్తు చేసింది. గంటలోపే ఈ మ్యాచ్ అయిపోవడం విశేషం. 

ఈ టోర్నీలో టాప్ ప్లేయర్లకు షాక్ ఇస్తూ సంచలనాలు సృష్టించిన క్విన్వెన్ జెంగ్‌ ఫైనల్లో తేలిపోయింది. కనీసం పోరాడకుండానే సబలెంకా ఆటకు తలవంచింది. 2023 లో విజేతగా నిలిచిన సబలెంకా.. వరుసగా రెండోసారి ఈ టైటిల్ ను గెలుచుకుంది. దీంతో 2013 తర్వాత వరుసగా రెండు సార్లు ఆస్ట్రేలియా ఓపెన్ గెలుచుకున్న ప్లేయర్ గా అరుదైన రికార్డ్ సొంతం చేసుకుంది. 2012, 2013 లో విక్టోరియా అజరెంకా మహిళల ఆస్ట్రేలియా ఓపెన్ విజేతగా నిలిచింది.