ఫైనల్ స్టేజ్​కు ఎస్ఆర్డీపీ పనులు

ఫైనల్ స్టేజ్​కు ఎస్ఆర్డీపీ పనులు
  •     ఫేజ్-1లో మొత్తం 42లో 33 కంప్లీట్
  •     ఈనెల 7 లేదా 8న మరో 3 పనులను ప్రారంభించనున్న ముఖ్యమంత్రి 
  •     ఇంకో 6 చోట్ల కొనసాగుతోన్న వర్క్స్ 
  •     అప్పులు తెచ్చి పనులు చేసిన గత సర్కార్  
  •     తొలి నుంచి నిధులు ఇవ్వక లేట్ గా​పూర్తి 

హైదరాబాద్, వెలుగు : సిటీలో ఎస్ఆర్డీపీ(స్ట్రాటజిక్ రోడ్ డెవలప్ మెంట్ ప్రోగ్రామ్) ఫస్ట్​ఫేజ్ లో భాగంగా రూ.5,937 కోట్లతో చేపట్టిన పనులు ఫైనల్ స్టేజ్ కు చేరాయి. మొత్తం 42 పనులకు ఇంకా 9 చోట్ల కొనసాగుతున్నాయి. ఇందులో  బైరామల్ గూడలో మల్టీలెవల్ గ్రేడ్ సపరేటర్ ని ఈనెల 7 లేదా 8న సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఇందులో ఒవైసీ హాస్పటల్ సైడ్ , చింతలకుంట వైపు, నాగార్జునసాగర్ వైపు ర్యాంపులు ఉన్నాయి. 

ఇవే కాకుండా  నల్గొండ ఫ్లై ఓవర్, ఫలక్ నుమా ఆర్వోబీ, శాస్ర్తిపురం ఆర్ వోబీ, ఆరాంఘర్ ఫ్లై ఓవర్,ఉప్పల్ ఫ్లై ఓవర్,  గచ్చిబౌలి శిల్ప సెకండ్ ఫేజ్ వంటి 6 పనులు  కొనసాగుతున్నాయి.  ఇవి పూర్తయితే మొదటి విడత ఎస్ఆర్డీపీ పనులు కంప్లీట్ అవుతాయి. వీటి తర్వాత రెండో దశ పనులపై సర్కార్ ఏం నిర్ణయం తీసుకుంటునేది వెయిట్ చేయాల్సి ఉంది. గత బీఆర్ఎస్​ ప్రభుత్వ హయాంలో రెండో ఫేజ్ కోసం జీహెచ్ఎంసీ అధికారులు ప్రపోజల్స్ కూడా పంపారు. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్​ ప్రభుత్వం ఇప్పటివరకు సెకండ్ ఫేజ్ పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. బైరామల్ గూడ ఫ్లై ఓవర్ ఓపెనింగ్ సమయంలో  సీఎం ఏదైనా మాట్లాడతారని ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. 

నిధులు లేక ఆలస్యం 

ప్రస్తుతం కొనసాగే 6 పనులకు సంబంధించి కూడా నిధులు లేక నత్తనడకన నడుస్తున్నాయి. రూ.5,937 కోట్లతో ఫస్ట్ ఫేజ్ పనులను గత సర్కార్ ప్రారంభించింది. అయితే పనులు స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా నిధుల కొరత ఏర్పడుతూనే ఉంది. అప్పట్లో పనులు చేపట్టేందుకు నిధులను అప్పుగా తీసుకురావాలని  నిర్ణయించారు. కానీ సమయానికి నిధులను మాత్రం ప్రభుత్వం అందించలేకపోయింది. 

ప్రస్తుతం కూడా నిధులు లేకపోవడంతో పనులు పూర్తికానీ పరిస్థితి నెలకొంది. గత  మూడు నెలల నుంచి పేమెంట్స్ లేక కాంట్రాక్టర్లు పనులు చేసేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే దాదాపు వెయ్యి కోట్లు పెండింగ్ లో ఉన్నాయి. మరో వెయ్యి కోట్లు ఇస్తేనే  పనులు పూర్తయ్యేలా ఉంది.

ఫేజ్-2​ కి అనుమతి ఇస్తే ..

ఎస్ఆర్డీపీ సెకండ్ ఫేజ్ పనులకు ప్రస్తుత ప్రభుత్వం పరిపాలన అనుమతులు ఇస్తే  మరో 36 పనులు మొదలు కానున్నాయి. ఇందులో స్కై వేలు, ఫ్లై ఓవర్లు, అండర్ పాస్ తదితర వంటివి చేపట్టనున్నారు. అవి.. ఉప్పల్​జంక్షన్ ఫ్లై ఓవర్, కూకట్ పల్లి వై జంక్షన్, బండ్లగూడలో ఒక ఫ్లైఓవర్, ఒమర్ హోటల్ జంక్షన్, రేతిబౌలి–నానల్‌నగర్‌లో మల్టీలెవల్ అండర్‌పాస్, ఫలక్ నుమా ఆర్ వోబీ, కుత్బుల్లాపూర్‌లో ఫాక్స్ సాగర్ పైప్‌లైన్‌పై వంతెన నిర్మాణం, ఖాజాగూడలో సొరంగం,  మాణికేశ్వర్ నగర్ ఆర్ యూబీ, చిలకలగూడలో ఆర్​యూబీ, ఆరాంఘర్‌లో రెండు రూబిల నిర్మాణంతో పాటు ఇంకొన్ని పనులు చేయనున్నారు.  అయితే గత ప్రభుత్వ హయాంలో ఈ పనులకు ప్రతిపాదనలు పంపారు. ఒకవేళ అనుమతులిస్తే ఈ పనులే ఉంటాయా? లేక మార్పులు చేస్తారా..! అనేది వెయిట్ చేయాల్సి ఉంది.