
టీఎల్ఎం మేళాల నిర్వహణ తీరుపై అసహనం
హైదరాబాద్, వెలుగు : తొలిమెట్టులో భాగంగా టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ (టీఎల్ఎం) మేళాల నిర్వహణ తీరుపై సర్కారు అసహనం వ్యక్తం చేసింది. టీచర్లు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు టీఎల్ఎం మేళాకు అటెండ్ అయితే.. స్కూళ్లలోని పాఠాలు ఎవరు చెప్పాలని అధికారులను ప్రశ్నించినట్లు తెలిసింది. సబ్జెక్టుల వారీగా మండల, జిల్లా, స్టేట్ లెవెల్ టీఎల్ఎం క్లాసులు బుధవారం నిర్వహించనున్నట్లు ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ మంగళవారం తెలిపారు. క్లాసులకు ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ టీచర్లు, ఎంఈవోలు, మండల నోడల్, క్లస్టర్ నోడల్,సెక్టోరల్ ఆఫీసర్లు, రీసోర్స్ పర్సన్లు పాల్గొనాలని సర్క్యూలర్ జారీ చేశారు.
వీరంతా టీశాట్ విద్యా చానల్ ద్వారా క్లాసులు చూడాలని..అవకాశం లేకపోతే టెలికాన్ఫరెన్స్ లో జాయిన్ అవ్వాలని సూచించారు. దీనిపై కొందరు విద్యాశాఖ సెక్రటరీ వాకాటి కరుణకు ఫిర్యాదు చేశారు. పొద్దంతా టీచర్లు టీవీల ముందు కూర్చుంటే స్కూళ్లను ఎవరు నడిపించాలని ఆమె అధికారులను ప్రశ్నించారు. దీంతో టీఎల్ఎం మేళా క్లాసులను బుధవారం 12 గంటల వరకే నిర్వహించారు.