కేసీఆర్ కుటుంబ పాలనను తరిమికొట్టాలె : పురుషోత్తం రూపాల

కేసీఆర్ కుటుంబ పాలనను తరిమికొట్టాలె : పురుషోత్తం రూపాల

మంచిర్యాల జిల్లా : తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ పాలనను తరిమికొట్టాలని కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖ మంత్రి పురుషోత్తం రూపాల బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలంటే కేవలం బూత్ స్థాయిలో పని చేసే కార్యకర్తలతోనే సాధ్యమన్నారు. అసెంబ్లీలో ఉన్న బూత్ కమిటీని త్వరగా పూర్తి చేయాలని పార్టీ నాయకులను ఆదేశించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాలనను స్ఫూర్తిగా తీసుకొని బీజేపీ కార్యకర్తలందరూ కృషి చేయాలని కోరారు. 

పార్లమెంట్ ప్రవాస్ యోజన కార్యక్రమంలో భాగంగా కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల మంచిర్యాల పట్టణంలోని హమాలీ వాడలో పర్యటించారు. బూత్ స్థాయిలో పార్టీ బలోపేతం చేయడంపై బీజేపీ కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. మరోవైపు.. మంచిర్యాల జిల్లా బీజేపీ అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మంచిర్యాల అసెంబ్లీ శక్తి కేంద్ర ఇన్ ఛార్జీల సమావేశంలోనూ పురుషోత్తం రూపాల పాల్గొన్నారు.