గుడ్ న్యూస్ : 71 వేల మందికి ఒకేసారి జాబ్ ఆఫర్ లెటర్లు

గుడ్ న్యూస్ : 71 వేల మందికి ఒకేసారి జాబ్ ఆఫర్ లెటర్లు

హైదరాబాద్/న్యూఢిల్లీ, వెలుగు : రోజ్ గార్ మేళాలో భాగంగా ప్రధాని మోడీ.. 2023, ఏప్రిల్ 13 గురువారం 71వేల మందికి జాబ్ అపాయింట్‌‌‌‌‌‌‌‌మెంట్ లెటర్లు ఇవ్వనున్నారు. 19 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 45 ప్రాంతాల్లో ఈ కార్యక్రమం వర్చువల్ గా నిర్వహించనున్నారు. మన రాష్ట్రంలో సికింద్రాబాద్ లోని రైల్ కళారంగ్ ఆడిటోరియంలో అపాయింట్‌‌‌‌‌‌‌‌మెంట్ లెటర్ల పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నారు. దీనిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమాన్ జైన్ పాల్గొననున్నట్లు దక్షిణ మధ్య రైల్వే మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించింది.

రైల్వేలో ట్రైన్ మేనేజర్, స్టేషన్ మాస్టర్, టికెట్ క్లర్క్ తో పాటు మరో 15 పోస్టులకు సెలక్ట్ అయినవారికి నియామకపత్రాలు ఇవ్వనున్నట్లు వివరించింది. అపాయింట్ లెటర్లు అందుకున్న వారికి ఆన్ లైన్ ఓరియెంటేషన్ కోర్స్ ఉంటుందని పేర్కొంది. అధికారులు తెలిపారు. జోన్ పరిధిలోని సికింద్రాబాద్, విజయవాడ, గుంతకల్లు, నాందేడ్ లో కార్యక్రమం జరగనుంది.

కిషన్ రెడ్డికి క్యూబా ప్రభుత్వ ఆహ్వానం

వచ్చే నెల 1 నుంచి 5 వరకు క్యూబా రాజధాని హవానాలో జరగనున్న 41వ ఇంటర్నేషనల్ టూరిజం ఫేర్ (ఫిట్ క్యూబా)కు హాజరుకావాలని కేంద్ర పర్యాటక మంత్రి కిషన్ రెడ్డికి ఆహ్వానం అందింది. ఈ మేరకు క్యూబా పర్యాటక మంత్రి జువాన్ కార్లోస్ కార్సియా గ్రాండా కిషన్ రెడ్డికి లెటర్ రాశారు. ‘జీ 77+ చైనా’సమావేశాలకు క్యూబా నేతృత్వం వహిస్తోంది.

ఇందులో భాగంగా మే 5న ఏర్పాటు చేయనున్న మంత్రుల స్థాయి పర్యాటక సదస్సులో పాల్గొని ‘ప్రపంచవ్యాప్తంగా పర్యాటక రంగం ఎదుర్కుంటున్న సమస్యలు, పర్యాటకాన్ని అభివృద్ధి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలు’అనే అంశంపై విలువైన సూచనలు ఇవ్వాలని కిషన్ రెడ్డిని కార్సియా కోరారు.