
కొమురవెల్లిలో పట్నంవారంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కావడంతో మల్లన్నకు మొక్కులు చెల్లించుకోవడానికి భక్తులు భారీగా తరలివచ్చారు. మల్లన్న నామస్మరణతో ఆలయ పరిసరాలు మార్మోగాయి. కోనేరులో స్నానాలు చేసి ఒక్కపొద్దులతో నైవేద్యాన్ని వండి బోనాలు సమర్పించారు. గంటలతరబడి లైన్లో నిల్చొని స్వామివారిని దర్శించుకున్నారు. గుట్టపైన ఉన్న ఎల్లమ్మ, పోచమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా, ఆలయ అధికారులు, పోలీస్ సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేశారు.
- కొమురవెల్లి, వెలుగు