
లండన్: ఇంగ్లండ్‌తో ఏకైక టెస్ట్‌కు సమయం దగ్గరపడుతున్న వేళ.. టీమిండియా ప్రాక్టీస్‌ను ముమ్మరం చేసింది. లీస్టర్‌షైర్ కౌంటీ గ్రౌండ్లో సోమవారం పూర్తి స్థాయి నెట్ సెషన్‌లో పాల్గొంది. మొదట కెప్టెన్ రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ తమ బ్యాటింగ్ స్కిల్స్‌ను సరి చూసుకున్నారు. మూడు నెలలుగా రెడ్‌బాల్‌కు దూరంగా ఉన్న ఈ ఇద్దరూ ఎక్కువగా షార్ట్ బాల్స్‌ను ప్రాక్టీస్ చేశారు. మిగతా వారు వర్కౌట్స్ తర్వాత నెట్స్‌లో బ్యాట్లు పట్టారు. బౌలర్లందరూ కాసేపు రన్నింగ్ డ్రిల్ చేసిన తర్వాత బౌలింగ్ వేశారు. బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ ఆధ్వర్యంలో పుజారా క్యాచ్‌లు ప్రాక్టీస్ చేశాడు. ఈ టూర్ ప్రిపరేషన్స్‌లో భాగంగా టీమిండియా.. ఈ నెల 24 నుంచి లీస్టర్‌షైర్‌తో వామప్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌లో ఫుల్ టీమ్‌ను దించాలని మేనేజ్‌మెంట్ భావిస్తోంది. ఇక, సౌతాఫ్రికాతో సిరీస్ ముగించుకొని లండన్ బయలుదేరిన చీఫ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్.. మంగళవారం టీమ్‌తో కలవనున్నారు.