బీహార్ లోక్‌సభ ఎన్నికల్లో.. AIMIM 16 మంది అభ్యర్థులు

బీహార్ లోక్‌సభ ఎన్నికల్లో.. AIMIM 16 మంది అభ్యర్థులు

అసదుద్దీన్ ఓవైసీ AIMIM పార్టీ బీహార్‌ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీచేయాని నిర్ణయించుకుంది. 16 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు ఆల్ ఇండియా మజ్లిస్ ఈ -ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) గురువారం (మార్చి 28) ప్రకటించింది. దర్భంగా, పాటలీపుత్ర, కిషన్‌గంజ్, మధుబని, కతిహార్, ముజఫర్‌పూర్, గోపాల్‌గంజ్, షియోహర్, పూర్నియా, అరారియా, సీతామర్హి, కరకత్, మహరాజ్‌గంజ్, సమస్తీపూర్, పశ్చిమ్ చంపారన్, వాల్మీకి నగర్ స్థానాల్లో AIMIM అభ్యర్థులు పోటీ చేస్తారని రాష్ట్ర అధ్యక్షుడు అక్తరుల్ ఇమామ్ తెలిపారు. మా పార్టీ ఇండియా కూటమిలో చేరాలని భావిస్తున్నామని.. కానీ వారు మమ్మల్ని పట్టించుకోవడం లేదని ఇమామ్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. 

దేశ, రాష్ట్ర రాజకీయాల్లో ముస్లీంలను ప్రోత్సహించడం లేదని ఆయన అన్నారు. ఇస్లాం సామాజిక వర్గంలో చాలామంది వెనుకబడి ఉన్నారని వారి అభివృద్ధికి ఏ నాయకుడు కృషి చేయడం లేదని ఇమామ్ ఆవేదన తెలియజేశాడు. బీహార్‌లో 2020 అసెంబ్లీ ఎన్నికల సమయంలో AIMIM 5 స్థానాలను కైవసం చేసుకుంది. అంతేకాకుండా RJD, కాంగ్రెస్‌ పార్టీల అభ్యర్థలకు 20 కంటే ఎక్కువ స్థానాల్లో గట్టి పోటీని ఇచ్చింది. బీహార్‌లో ఏప్రిల్ 19, 26, మే 7, 13, 20, 25, జూన్ 1 తేదీల్లో ఏడు దశల్లో ఓటింగ్ జరగనుంది. వాటి ఫలితాలు జూన్ 4న విడుదలకానున్నాయి.