
హైదరాబాద్, వెలుగు: బీజేపీ సీనియర్‌నాయకుడు ఎల్కే అద్వానీకి భారతరత్న పురస్కారమిచ్చి దేశానికి ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారని ప్రధాని మోదీని ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు. ఆయనకు అవార్డు ఇవ్వడం అంటే దేశంలో లౌకికవాదాన్ని అణచివేయడమేనని విమర్శించారు.
శనివారం మీడియాతో ఆయన మాట్లాడుతూ, దేశంలో హిందూ, ముస్లింల మధ్య బీజేపీ ఇప్పటికి విభేదాలు సృష్టించి పాలన సాగిస్తోందని మండిపడ్డారు. బాబ్రీ మసీదును కూల్చడానికే అద్వానీ రథయాత్రను చేపట్టి దేశమంతా పర్యటించారని తెలిపారు. హిందూ, ముస్లింల మధ్య చిచ్చుపెట్టి మతఘర్షణలకు కారణమయ్యారని ఆరోపించారు. ఈ ఘర్షణల్లో వందలాది మంది మృతి చెందారని గుర్తుచేశారు.