గాంధీ స్థానంలో సావర్కర్‌ను జాతిపిత చేస్తారేమో?

గాంధీ స్థానంలో సావర్కర్‌ను జాతిపిత చేస్తారేమో?

న్యూఢిల్లీ: బీజేపీ నేతలు వక్రీకరించిన చరిత్రను ప్రచారం చేస్తున్నారని మజ్లిస్ చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. ఇది ఇలాగే కొనసాగితే గాంధీ హత్యలో ఆరోపణలు ఎదుర్కొన్న సావర్కర్‌ను జాతిపితగా చేస్తారేమోన్నారు. ‘వాళ్లు వక్రీకరించిన హిస్టరీని ప్రచారం చేస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే.. మహాత్మా గాంధీని తీసేసి సావర్కర్‌ను జాతిపిత చేస్తారు. గాంధీ హత్యలో సావర్కర్ ఆరోపణలు ఎదుర్కొన్నారని..  దీంట్లో ఆయన హస్తం ఉన్నట్లు జస్టిస్ జీవన్ లాల్ కపూర్ విచారణలో కూడా తేలింది’ అని ఒవైసీ గుర్తు చేశారు. 

సావర్కర్ మీద అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై అసదుద్దీన్ పైవిధంగా కామెంట్ చేశారు. జైలు నుంచి తనను విడుదల చేయాల్సిందిగా బ్రిటిష్ ప్రభుత్వానికి సావర్కర్ అర్జీ (మెర్సీ పిటిషన్) పెట్టుకున్నారని అబద్ధాలను వ్యాప్తి చేస్తున్నారని.. ఇందులో నిజం లేదని రాజ్‌నాథ్ అన్నారు. సావర్కర్‌ను మెర్సీ పిటిషన్ పెట్టుకోమని గాంధీయే సూచించారని రాజ్‌నాథ్ స్పష్టం చేశారు. సావర్కర్‌పై రాసిన ఓ బుక్ విడుదల సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే రాజ్‌నాథ్ కామెంట్లపై స్పందించిన అసదుద్దీన్.. చరిత్రను వక్రీకరించి చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

మరిన్ని వార్తలు: 

పాక్‌కు వెళ్లిన ముస్లింలకు గౌరవం దక్కట్లే

ఆలయంలోకి మందు బాటిల్​తో వెళ్లిన ఆర్జీవీ

కెప్టెన్సీ నుంచి నన్నేందుకు తీసేశారో చెప్పలే: వార్నర్