పాక్‌కు వెళ్లిన ముస్లింలకు గౌరవం దక్కట్లే

పాక్‌కు వెళ్లిన ముస్లింలకు గౌరవం దక్కట్లే

న్యూఢిల్లీ: భారతీయులందరి పూర్వీకులు ఒక్కరేనని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. మనం మాతృభూమిని మార్చలేమన్నారు. విభజన సమయంలో ఇండియా నుంచి పాకిస్థాన్‌కు వలస వెళ్లిన వారికి అక్కడ సరైన గౌరవం దక్కడం లేదన్నారు. మన దేశంలో అలా ఉండదని.. ఇక్కడ ఉదార సంస్కృతి ఉంటుందన్నారు. ‘వీర్ సావర్కర్: ది మ్యాన్ హూ కుడ్ హ్యావ్ ప్రివెంటెడ్ పార్టిషన్’ అనే పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న భగవత్ పైవ్యాఖ్యలు చేశారు. 

‘భారత్, పాకిస్థాన్ విభజన తర్వాత దాయాది దేశానికి వలస వెళ్లిన ముస్లింలకు గౌరవం లేకుండా పోయింది. ఇండియా ఉదార సంస్కృతిని పాటిస్తుంది. ఇది మన సాంస్కృతిక వారసత్వం. ఈ కల్చర్ మనల్ని ఒక్కటిగా కలిపి ఉంచుతుంది. ఇదే అసలైన హిందూ సంస్కృతి. హిందూ రాజుల కాషాయ జెండా, ముస్లిం నవాబుల పచ్చ జెండా కలసి బ్రిటీషర్లపై ఎలా పోరాడాలో సావర్కర్ రాశారు. అండమాన్ జైలు నుంచి తిరిగొచ్చాక హిందూ నేషనలిజం అంటే భిన్న మతాలు ఆచరించే వారిని కలిపి ఉంచడమని ఓ బుక్‌లో ఆయన రాసుకొచ్చారు. ఇండియాలో విభజన తీసుకొస్తేనే తాము అధికారం చెలాయించొచ్చని బ్రిటిషర్లు అర్థం చేసుకున్నారు. అందుకే వాళ్లు రాడికలిజంను పెంచడానికి ప్రయత్నించారు’ అని భగవత్ చెప్పారు. దేశంలో భిన్న మతస్థులు ఉన్నప్పటికీ అందరూ కలసి ఉండటమే అసలైన హిందూ జాతీయవాదమన్నారు.  

మరిన్ని వార్తలు: 

ఆలయంలోకి మందు బాటిల్​తో వెళ్లిన ఆర్జీవీ

కెప్టెన్సీ నుంచి నన్నేందుకు తీసేశారో చెప్పలే:  వార్నర్

అట్ల బూతులు తిడితే కొనసాగుడెట్ల?