అట్ల బూతులు తిడితే కొనసాగుడెట్ల?

అట్ల బూతులు తిడితే కొనసాగుడెట్ల?

హైదరాబాద్, వెలుగు: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల్లో చెలరేగిన వివాదం రాజీనామాల దాకా వచ్చింది. ‘మా’ ఎన్నికల్లో తన ప్యానెల్ నుంచి వివిధ పదవులకు పోటీ చేసి గెలిచిన వాళ్లమంతా రాజీనామా చేస్తున్నామని ప్రకాశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రకటించారు. ఎన్నికలప్పుడు మంచు విష్ణు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ఎలాంటి అడ్డంకులు ఎదురుకావొద్దనే ఈ నిర్ణయం తీసుకున్నామని మంగళవారం మీడియాకు తెలిపారు. రెండ్రోజుల నుంచి జరుగుతున్న ఇన్సిడెంట్స్ పై తమ ప్యానెల్ సభ్యులందరితో చర్చించి, రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. ఎన్నికల టైంలో మాటల పోరు, రౌడీయిజం జరిగిందని, పోస్టల్ బ్యాలెట్లలోనూ తమకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. ఎక్కడెక్కడి నుంచో మనుషులను రప్పించారని, రాత్రికి రాత్రే ఫలితాలు మారిపోయాయన్నారు. మొదటి రోజు తమ ప్యానల్ నుంచి 11 మంది ఈసీ మెంబర్లుగా గెలవగా, తెల్లారేసరికి ఆ సంఖ్య తగ్గిందన్నారు. ‘మా’ క్రమశిక్షణ సంఘంలో ఒకరైన మోహన్ బాబు.. బెనర్జీపై చేయి చేసుకోవడం, బూతులు తిట్టడం లాంటి ఘటనలు జరిగాయన్నారు.

బయట నుంచే ప్రశ్నిస్తం

జనరల్ సెక్రటరీ, ట్రెజరర్ ఇలా అంతా మావాళ్లే, ఎవరు అడ్డొచ్చినా మాదే మెజారిటీ అంటూ విష్ణు విడదీసి మాట్లాడారని, ఇలాంటి ప్యానెల్​తో కలిసి పనిచేయగలమా అని చర్చించామని ప్రకాశ్ రాజ్ తెలిపారు. మావాళ్లు ప్రశ్నించడం ద్వారా విష్ణు ప్రకటించిన సంక్షేమ కార్యక్రమాలు ఆగి మళ్లీ గొడవలే మిగులుతాయన్నారు. ‘మా’ బెటర్‌‌‌‌మెంట్ కోసం రాజీనామా చేయక తప్పట్లేదన్నారు.
 
అట్ల బూతులు తిడితే కొనసాగుడెట్ల?

ఎన్నికల సమయంలో మోహన్ బాబు తనను బూతులు తిట్టారని ప్రెస్ మీట్‌‌‌‌లో తనీశ్ ఎమోషనల్ అయ్యాడు. తను ఏడుస్తుంటే విష్ణు, మనోజ్ వచ్చి ఓదార్చారన్నాడు. ఇలా భయపడుతూ ఈసీ మీటింగ్​లలో పాల్గొనలేకే  రాజీనామా చేస్తున్నట్టు తనీశ్ చెప్పారు. తనీశ్​ను తిడుతుంటే అడ్డు పడ్డందుకు మోహన్ బాబు తనని కొట్టడానికి వచ్చారని మరో యాక్టర్ బెనర్జీ కన్నీళ్లు పెట్టుకున్నారు. అరగంటపాటు ఆపకుండా పచ్చి బూతులు తిట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పుడే విష్ణు, మనోజ్ వచ్చి సారీ చెప్పారని, ఆ తర్వాత మోహన్ బాబు వైఫ్ కూడా ఫోన్ చేసి బాధపడ్డారని చెప్పారు. జరిగిన విషయం చెబుతున్నంతసేపు బెనర్జీ కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. గత ఎన్నికలప్పుడు కూడా నరేశ్ ఇలాగే తన ముఖంలో ముఖం పెట్టి ఒక్కొక్కరి సంగతి చెప్తానంటూ బూతులు తిడుతూ బెదిరించారని ఉత్తేజ్ గుర్తుచేశారు. ఇప్పుడే ఇలా ఉంటే భవిష్యత్తులో ఎలా ఉంటుందోననే భయంతోనే రిజైన్ చేస్తున్నానని ఉత్తేజ్ చెప్పారు. సమీర్, ప్రభాకర్, శివారెడ్డి, కౌశిక్ కూడా తమకు ఎదురైన అనుభవాలు చెప్తూ ‘మా’ కార్యవర్గంలో కొనసాగలేమని ప్రకటించారు.

బైలాస్ మార్చబోను అంటే రాజీనామా వాపస్ 

తెలుగువాళ్లు కానోళ్లను ‘మా’ ఎన్నికల్లో పోటీ చేయకుండా బైలాస్ మారుస్తామని విష్ణు గతంలో అన్నారని ప్రకాశ్ రాజ్ గుర్తుచేశారు. అయితే, తెలుగువాళ్లు కాకపోయినా పోటీ చేయడానికి వీలు కల్పిస్తానని హామీ ఇస్తేనే తన రాజీనామాను వాపస్ తీసుకుంటానని ఆయన స్పష్టం చేశారు. విష్ణు ప్రకటించినట్లుగానే చేస్తే మాత్రం ఓటు వేయడానికే పనికివచ్చే మెంబర్​షిప్ తనకు వద్దని చెప్పారు. తామేదో కొత్త అసోసియేషన్ స్టార్ట్ చేయబోతున్నట్లు వినిపిస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. ‘‘ఆత్మ, పరమాత్మ, ప్రేతాత్మ అని మేమేదో కొత్త అసొసియేషన్ స్టార్ట్ చేయబోతున్నాం అని వినిపిస్తోంది. అలాంటి ఐడియాలు లేవు. ‘మా’ అసోసియేషన్‌లో ఉన్న సమస్యలపై స్పందించడానికే తప్ప మరొక అసోసియేషన్ స్టార్ట్ చేసే ఆలోచన లేదు”అని ప్రకాశ్ రాజ్ క్లారిటీ ఇచ్చారు.