అమిత్ షా అధికార గర్వంతో మాట్లాడుతున్రు : ఓవైసీ

అమిత్ షా  అధికార గర్వంతో  మాట్లాడుతున్రు : ఓవైసీ

కేంద్ర హోంమంత్రి  అమిత్ షా అధికార గర్వంతో మాట్లాడుతున్నారని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. 2002లో నేరస్తులకు  గుణపాఠం చెప్పామంటూ అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై  ఫైర్ అయ్యారు. బిల్కిస్ అత్యాచార కేసులో దోషులను బీజేపీ విడిచిపెట్టిందని విమర్శించారు. దోషులను విడిచిపెట్టి బాధితులకు అన్యాయం చేసిందని మండిపడ్డారు. నేరస్థులకు శిక్ష పడినప్పుడే సమాజంలో అసలైన శాంతి నెలకొంటుందని చెప్పారు. 

అధికారం ఎప్పుడూ ఒక్కరి చేతిలోనే ఉండదని అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యానించారు. ఏదో ఒకరోజు అధికారం మారుతుందని..అధికారంలో ఉన్నారనే భావనతోనే అమిత్‌ షా ఇలాంటి కామెంట్స్‌ చేస్తున్నారని విమర్శించారు. కాగా, కాంగ్రెస్ మద్దతుతో గతంలో సంఘ విద్రోహ శక్తులు గుజరాత్లో హింసకు పాల్పడేవారని.. వారికి 2002లోనే  బీజేపీ గుణపాఠం చెప్పిందంటూ అమిత్ షా వ్యాఖ్యానించారు.