శంషాబాద్ లో ఆశా వర్కర్ల ధర్నా

శంషాబాద్ లో ఆశా వర్కర్ల ధర్నా

శంషాబాద్ లో ఆశా వర్కర్లు ధర్నాకు దిగారు. ఆశా వర్కర్ల సమస్యలపై శంషాబాద్ మండల పరిధిలోని పెద్ద షాపు పీహెచ్ సీ ముందు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆశా వర్కర్ల జిల్లా కార్యదర్శి సునీత మాట్లాడుతూ.. అధిక పని భారం తగ్గించి కనీస వేతనం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆశా వర్కర్లను వేధించడం మానుకోవాలని అన్నారు. పని చేస్తున్న సందర్భంలో ఆశా వర్కర్లకు పని భారం పెంచారని ఆవేదన వ్యక్తం చేశారు. 

పురుషులను కూడా చెకప్ చేయాలని చెప్తున్నారు.. ఒక ఆడపిల్ల మగ పిల్లవాడిని చెకప్ చేయడం ఎంతవరకు సమంజసమని సునీత ప్రశ్నించారు. ఇటువంటి దుర్మార్గమైన పని చెప్పి పని భారాన్ని పెంచే పద్ధతిని మానుకోవాలని ఆమె అన్నారు. ఈ విషయాలపై కచ్చితంగా మేము ఎలాంటి పోరాటానికైనా సిద్ధమేనని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.కార్యక్రమంలో ఆశా వర్కర్ల మండల అధ్యక్షులు సునంద, కార్యదర్శి నవనీత, కమిటీ సభ్యులు మంజుల, శారద, రెహనా, సులోచన, తిరుమల,జయమ్మ,అరుణ తదితరులు పాల్గొన్నారు.