
అడిలైడ్: యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న సెకండ్ టెస్ట్ (డే/నైట్)లో విజయానికి ఆస్ట్రేలియా ఆరు వికెట్ల దూరంలో నిలిచింది. ఆసీస్ ఇచ్చిన 468 రన్స్ భారీ టార్గెట్ ఛేజింగ్‌లో .. నాలుగో రోజు ఆట ముగిసే సరికి ఇంగ్లండ్ 82/4పై నిలిచింది. బెన్ స్టోక్స్ (3 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. చివరి రోజు ఆట మిగిలుండగా ఇంగ్లండ్ గెలవాలంటే ఇంకో 386 రన్స్ చేయాలి. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఇంగ్లండ్ ఓటమి తప్పించుకోలేదు. ఒకవేళ ఇంగ్లండ్ గెలిస్తే.. టెస్టుల్లో అతి పెద్ద టార్గెట్ చేజ్ చేసిన జట్టుగా రికార్డు సాధించనుంది. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 45/1తో ఆదివారం సెకండ్ ఇన్నింగ్స్ కొనసాగించిన ఆసీస్ 230/9 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. లబుషేన్ (51), ట్రావిస్ హెడ్ (51) హాఫ్ సెంచరీలు చేయగా కామెరూన్ గ్రీన్ (33 నాటౌట్) రాణించాడు. ఇంగ్లిష్ బౌలర్లలో రాబిన్సన్, జో రూట్, మలన్ తలా రెండు వికెట్లు తీశారు.