Ashes Series: మైదానంలోకి నిరసనకారులు.. WWE స్టార్‌లా మారిపోయిన బెయిర్‌స్టో

Ashes Series: మైదానంలోకి నిరసనకారులు.. WWE స్టార్‌లా మారిపోయిన బెయిర్‌స్టో

ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ రెండో టెస్టులో గందరగోళ పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య తొలి రోజు ఆట ప్రారంభమైన కాసేపటికే మైదానంలోకి నిరసన కారులు చొచ్చుకొచ్చారు. దీంతో అంపైర్లు.. ఆటను కాసేపు నిలిపివేశారు. 

టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ బౌలింగ్‌ ఎంచుకోగా.. మ్యాచ్‌ ప్రారంభమైన తొలి ఓవర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. 'జస్ట్‌ స్టాప్‌ ఆయిల్‌ గ్రూప్‌’కు చెందిన పలువురు నిరసనకారులు సెక్యూరిటీ కళ్లు గప్పి మైధానంలోకి దూసుకువచ్చారు. వారు మైదానంలో ఆరెంజ్‌ పౌడర్‌ను చల్లేందుకు ప్రయత్నించగా.. ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా ఆటగాళ్లు వారిని అడ్డుకున్నారు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

" Just Stop Oil " Protesters diarupt Lord's Test.
Jonny Bairstow removed one of the two pitch invaders.#Ashes #Ashes23pic.twitter.com/QhWCIlIL6Z

— Zeeshan Qayyum ☄️ (@XeeshanQayyum) June 28, 2023

WWE స్టార్‌లా మారిపోయిన బెయిర్‌స్టో

మైదానంలోకి చొచ్చుకొచ్చిన ఓ నిరసనకారుడిని ఇంగ్లండ్‌ వికెట్‌ కీపర్‌ జానీ బెయిర్‌ స్టో పట్టుకున్నాడు. అతన్ని సంకలో పెట్టుకెళ్ళి సెక్యూరిటీ సిబ్బందికి అప్పగించాడు. బెయిర్‌స్టో చేసిన ఈ పనిని పలువురు మెచ్చుకున్నారు. WWE ఫైటర్‌లా మారిపోయాడని పలువురు కామెంట్ చేశారు. బెయిర్‌స్టో నిరసనకారుడిని ఎత్తుకువెళ్తున్న వీడియోపై రవిచంద్రన్‌ అశ్విన్‌ సైతం స్పందించాడు. 'రెండో టెస్టుకు మంచి ఆరంభందొరికింది.. బెయిర్‌స్టో హెవీ వెయిట్ లిఫ్టింగ్ మొదలుపెట్టాడు' అని ట్వీట్ చేశాడు. కాసేపటి తరువాత మ్యాచ్ తిరిగి ప్రారంభమైంది.

Good start to the 2nd test.
Bairstow has done some heavy lifting already?? #Ashes2023 pic.twitter.com/f0JcZnCvEr

— Ashwin ?? (@ashwinravi99) June 28, 2023