ఇది చీటింగ్..ఇలా ఔట్ చేస్తారా..?

ఇది చీటింగ్..ఇలా ఔట్ చేస్తారా..?

ఇంగ్లాండ్ ఆస్ట్రేలియాతో మధ్య జరిగిన రెండో టెస్టులో బెయిర్‌స్టో అవుటైన విధానం వివాదాస్పదమైంది. ఇది చీటింగ్ అంటూ ఆస్ట్రేలియాపై అభిమానులు మండిపడుతున్నారు. 

ఎలా ఔటయ్యాడంటే..

రెండో టెస్టులో సెకండ్ ఇన్నింగ్స్ లో బెయిర్‌స్టో .. కామెరూన్ గ్రీన్ వేసిన షార్ట్ బాల్‌ను తప్పించుకున్నాడు. ఆ బంతి కాస్తా కీపర్ చేతుల్లో పడింది. అయితే బంతి కీపర్ వైపు వెళ్లగానే బెయిర్ స్టో  క్రీజులో నుంచి ముందుకొచ్చాడు. బెయిర్‌స్టో క్రీజు వదలగానే అలెక్స్ కారీ తన చేతిలోని బాల్ ను వికెట్ల మీదుకు విసిరాడు. అది వికెట్లకు తాకగానే అప్పీల్ చేశాడు. అతనితోపాటు ఆసీస్ టీం కూడా అప్పీల్ చేసింది. మైదానంలోని అంపైర్..థార్డ్ అంపైర్ కు రిఫర్ చేశాడు. దీన్ని పరిశీలించిన థార్డ్ అంపైర్.. బెయిర్‌స్టోను అవుట్‌గా ప్రకటించాడు. దీంతో ఇంగ్లండ్ ఆటగాళ్లతో పాటు.. ఫ్యాన్స్ షాకయ్యారు. 

నిబంధనలు ఏం చెప్తున్నాయి..?

క్రికెట్ లో సాధారణంగా బౌలర్ వేసిన బంతిని బ్యాట్ తో ఆడకుండా కీపర్ కు వదిలేసిన తర్వాత బ్యాట్స్ మన్  క్రీజులో ఒకసారి బ్యాటు ఉంచాలి.  లేదంటే అంపైర్‌కు సైగ చేయాలి. ఆ తర్వాతే క్రీజులో నుంచి  బయటకు కదలాలి. అయితే  బెయిర్‌స్టో క్రీజులో కాలు పెట్టి..ఆ  తర్వాత బయటకు వచ్చాడు. దీన్ని ఆసీస్ కీపర్ అలెక్స్ క్యారీ  అవకాశంగా తీసుకున్నాడు. వికెట్ల మీదకు బంతిని విసిరేశాడు. అది వికెట్లను తాకడంతో అప్పీల్ చేశాడు. థార్డ్ అంపైర్ ఔట్ ఇచ్చాడు. 

ఇది చీటింగ్...కరెక్ట్ కాదు..

బెయిర్ స్టో రనౌట్ క్రీడా స్పూర్తికి విరుద్ధం అంటూ అభిమానులు, మాజీ ఆటగాళ్లు మండిపడుతున్నారు. ఆసీస్ దిగ్గజం బ్రాడ్ హాగ్ కూడా ఈ రనౌట్ పై అసహనం వ్యక్తం చేశాడు.  ఆసీస్ టీంకు  చీటింగ్ చేయడం అలవాటే అని  ఫ్యాన్స్ విమర్శిస్తున్నారు.