Love Me Teaser: బేబీతో కాకుండా..దెయ్యంతో రొమాన్స్ ఏంటి భయ్యా!

 Love Me Teaser: బేబీతో కాకుండా..దెయ్యంతో రొమాన్స్ ఏంటి భయ్యా!

యంగ్ హీరో ఆశిష్ రెడ్డి (Ashish Reddy). ప్రముఖ నిర్మాత దిల్ రాజు (Dil Raju) సోదరుడు శిరీష్ (Shirish) కొడుకుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఆశిష్ మొదటి సినిమాతోనే మంచి మార్కులు తెచుకున్నాడు. సినిమా మాత్రం ఆశించినంత సక్సెస్ కాలేకపోయింది. ఆ తరువాత వెంటనే సెల్ఫీష్ అనే సినిమాను మొదలుపెట్టాడు. చాలా రోజుల క్రితమే మొదలైన ఈ సినిమా గత రెండు సంవత్సరాలుగా షూటింగ్ జరుపుకుంటూనే ఉంది.

ప్రస్తుతం దర్శకుడు అరుణ్ భీమవరపుతో రీసెంట్ గా ఓ సినిమాను అనౌన్స్ చేశాడు. లవ్ మీ అనే టైటిల్ తో వస్తున్న ఈ సినిమాకు ఈఫ్ యూ డేర్ అనేది ఉపశీర్షిక. 

లేటెస్ట్గా లవ్ మీ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. హీరో దెయ్యంతో ప్రేమలో పడతాడు అని అర్థమవుతోంది. దెయ్యాన్ని ప్రేమించి, ఆమెతో రొమాన్స్ చేయాలనుకొనే ఒక యువకుడు కథే లవ్ మీ. పోస్టర్ లో కూడా అదే విషయాన్ని మెన్షన్ చేశారు మేకర్స్.

'భయమేసే చోట రొమాన్స్..ఇంకా ఎగ్జైటింగ్ గా ఉంటుంది పిల్ల” అని ఆశిష్ చెప్పే డైలాగ్ ఇంట్రస్టింగ్ ఉంది. ఒక దట్టమైన అడివి.. దాని మధ్యలో ఒక పాడుబడ్డ  బంగ్లా.. అందులో ఒక అందమైన ఆడ దెయ్యం. ఇంతవరకు ఆ బంగ్లాకు వెళ్లిన వారెవ్వరు తిరిగి బయటకు వచ్చింది లేదనే విషయం తెలుసుకున్న ఆశిష్, వైష్ణవి.. ఆ బంగ్లా చూడటానికి వెళ్లారు. అక్కడ ఆశిష్ ఎలాగైనా ఆ దెయ్యంతో ప్రేమలో పడి రొమాన్స్ చేయాలనీ ప్రయత్నిస్తాడు. ఇక అతడికి పిచ్చి పట్టిందని ఫిక్స్ అయ్యి..వైష్ణవి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. చివరికి ఆశిష్  కు దెయ్యం ప్రేమలో పడిందా? లేదా అనేది ఈ కథ అని తెలుస్తోంది. 

ALSO READ :-Rakul Preet Singh: దైవ దర్శనంలో..రకుల్ భగ్నానీ జంట

అంతేకాదు ఈ సినిమా కోసం స్టార్ కాస్ట్ ను సెట్ చేశారు. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా.. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ కూడా వర్క్ చేస్తున్నారు. దీంతో ఈ సినిమాపై ఇప్పటినుండే అంచనాలు పీక్స్ కు చేరుకుంటున్నాయి. మరి వినూత్న కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా ఆడియన్స్ ను ఏమేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.