Rakul Preet Singh: దైవ దర్శనంలో..రకుల్ భగ్నానీ జంట

Rakul Preet Singh: దైవ దర్శనంలో..రకుల్ భగ్నానీ జంట

స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preeth Singh) బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీ (Jocky Bhgnani)  (ఫిబ్రవరి 21న) వివాహబంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. మూడేళ్లుగా ప్రేమ బంధంలో ఉన్న వీరు ఇప్పుడు దంపతులు అయ్యారు. 

అయితే..ఇన్నాళ్లు ప్రేమ..పెళ్లి అంటూ ఫొటోస్ తెగ వైరల్ అవుతూ వచ్చాయి..ఇక లేటెస్ట్గా ఈ కొత్త జంట అత్యంత ప్రాచీనమైన కామాఖ్య దేవాలయంలో కొలువై ఉన్న కామాఖ్య దేవి అమ్మవారిని దర్శించుకున్నారు.వీరితో పాటు కుటుంబ సభ్యులు మరియు సన్నిహితులు ఉన్నారు.ప్రస్తుతం కామాఖ్యదేవి ఆలయ సందర్శనకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

రకుల్ పెళ్లి తర్వాత కూడా తన సినిమా కెరీర్‌ ను కొనసాగిస్తాను తెలిపింది. అంతేకాకుండా త్వరలో వెబ్‌ సిరీస్‌ ల్లో కూడా నటించే అవకాశాలు ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. 

ALSO READ :- కవిత రూటే సెపరేట్?..బీఆర్ఎస్తో సమాంతరంగా ప్రోగ్రామ్స్

రకుల్ - జాకీ వివాహం గోవాలో గ్రాండ్‍గా జరిగగా.. వీరి పెళ్ళి ఇరు కుటుంబ సభ్యులకు సంబంధించిన పంజాబీ ఆనంద్ కరాజ్, సింధి సంప్రదాయల్లో.. వివాహ వేడుకను ఎంతో వైభవంగా జరుపుకున్నారు.