నిర్వాసితులకు విద్య తో పాటుఅన్ని వసతులు కల్పిస్తాం : ఆశిష్ సాంగ్వాన్

నిర్వాసితులకు విద్య తో పాటుఅన్ని వసతులు కల్పిస్తాం : ఆశిష్ సాంగ్వాన్

కడెం,వెలుగు: కడెం మండలం కొత్త మద్దిపడగలో  నిర్మించిన పునరావాస ఇండ్లను గురువారం  కలెక్టర్​ ఆశిష్ సాంగ్వాన్ పరిశీలించారు. మైసంపేట్, రాంపూర్ గ్రామాలను తరలించడం కోసం   జిల్లా అటవీ శాఖ అధికారి రామకిషన్ తో కలసి   జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా  కలెక్టర్ మాట్లాడుతూ  రాంపూర్, మైసంపేట్ గ్రామాల ప్రజల కోసం  కొత్త మద్దిపడగ గ్రామం లో   నిర్మించిన 94 ఇండ్లను పూర్తి చేశామన్నారు.  

స్వచ్ఛంద పునరావాసం కోసం చేసిన పనులను,   అటవీ హక్కుల చట్టం ప్రకారం కమిటీ నిర్ధారిస్తుందన్నారు.  ఈ గ్రామాల్లో  పాఠశాలలను మద్దిపడగకు తరలించాలని గ్రామస్థులు కోరారు. స్పందించిన కలెక్టర్​ ఐటీడీఏ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశం లో   ఈఈపీఆర్ శంకరయ్య, సీఓ సుధీర్, డీఆర్డీఓ  విజయలక్ష్మీ, ఎంపీడీవో వెంకటేశ్వర్లు, ఎఫ్ఆర్వో అనిత పాల్గొన్నారు.