
హైదరాబాద్, వెలుగు: పీసీసీ లీగల్ సెల్, హ్యూమన్ రైట్స్, ఆర్టీఐ డిపార్ట్ మెంట్ చైర్మన్‌గా పొన్నం అశోక్ గౌడ్ నియమితు లయ్యారు. ఈ మేరకు ఏఐసీసీ నేషనల్ సెక్రటరీ విపుల్ మహేశ్వరీ ఉత్తర్వులు జారీ చేశారు. లీగల్ సెల్ చైర్మన్ పదవికోసం అశోక్ గౌడ్ పేరును ప్రతిపాదిస్తూ కాంగ్రెస్ అధిష్టానానికి పీసీసీ లేఖ రాసింది. దీంతో కాంగ్రెస్ చీఫ్ ఖర్గే, అగ్రనేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ సూచన మేరకు అశోక్ గౌడ్‌ను నియమించినట్లు విపుల్ మహేశ్వరీ తెలిపారు. ఉమ్మడి కరీంనగర్, హైదరాబాద్‌లో సీనియర్ అడ్వొకేట్‌గా పొన్నం అశోక్ గౌడ్ గుర్తింపు పొందారు. ఆయన తెలంగాణ హైకోర్టు న్యాయవా దుల సంఘం అధ్యక్షుడిగా కూడా పనిచేశారు.