IND vs ENG 1st Test: చెలరేగిన భారత బౌలర్లు.. ఓటమి దిశగా ఇంగ్లాండ్

IND vs ENG 1st Test: చెలరేగిన భారత బౌలర్లు.. ఓటమి దిశగా ఇంగ్లాండ్

ఉప్పల్ టెస్ట్ ముగింపు దశకు చేరుకుంది. తొలి ఇన్నింగ్స్ లో 190 పరుగుల భారీ ఆధిక్యం సంపాదించుకున్న టీమిండియా.. రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ భరతం పడుతున్నారు. మూడో రోజు టీ విరామానికి స్టోక్స్ సేన 5 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. క్రీజ్ లో పోప్ (67), వికెట్ కీపర్ ఫోక్స్ (2) ఉన్నారు. ఇంకా ఇంగ్లీష్ జట్టు 18 పరుగులు వెనకబడి ఉండగా.. చేతిలో 5 వికెట్లు మాత్రమే ఉన్నాయి. చివరి సెషన్ లో భారత బౌలర్లు చెలరేగితే ఈ రోజే మ్యాచ్ ముగిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

బుమ్రా మ్యాజిక్ 

లంచ్ విరామానికి వికెట్ నష్టానికి 89 పరుగులు చేసి పటిష్ట స్థితిలో నిలిచిన ఇంగ్లాండ్.. బుమ్రా రాకతో ఒక్కసారిగా కుదేలైంది. క్రీజ్ లో పాతుకుపోయిన ఓపెనర్ డకెట్ ను క్లీన్ బౌల్డ్ చేయడంతో పాటు స్టార్ బ్యాటర్ రూట్ ను పెవిలియన్ కు చేర్చాడు. డకెట్ 47 పరుగులు చేస్తే రూట్ కేవలం 2 పరుగులు మాత్రమే చేశాడు. ఆ తర్వాత జడేజా ఒక అద్భుతమైన బంతితో బెయిర్ స్టోని ఔట్ చేయడంతో పాటు కెప్టెన్ బెన్ స్టోక్స్ ను అశ్విన్ బోల్తాకొటించాడు. దీంతో ఒక దశలో వికెట్ నష్టానికి 113 పరుగులు చేసిన ఇంగ్లాండ్ 163 పరుగులకు 5 వికెట్లను కోల్పోయింది. 

ఇంగ్లాండ్ లో పోప్ 67 పరుగులు చేసి ఒంటరి పోరాటం చేస్తున్నాడు. భారత బౌలర్లలో బుమ్రా, అశ్విన్ చెరో రెండు వికెట్లు తీసుకోగా.. జడేజాకు ఒక వికెట్ దక్కింది. తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ 246 పరుగులకే ఆలౌట్ కాగా.. భారత్ 436 పరుగులు చేసింది.