హైదరాబాద్‌లో ముగిసిన BCCI అవార్డ్స్.. విజేతలు వీరే

హైదరాబాద్‌లో ముగిసిన BCCI అవార్డ్స్.. విజేతలు వీరే

నాలుగు సంవత్సరాల విరామం తర్వాత బీసీసీఐ అవార్డులు హైదరాబాద్‌లో జరిగాయి. శుభమాన్ గిల్, రవి చంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా,  మహ్మద్ షమీ గత నాలుగు సంవత్సరాల పురుషుల అవార్డులను సొంతం చేసుకున్నారు. దీప్తి శర్మ, స్మృత్ మంధాన రెండేసి సార్లు  మహిళా అవార్డు విజేతలుగా నిలిచారు. రవిశాస్త్రి, ఫరూఖ్ ఇంజనీర్‌లకు జీవితకాల సాఫల్య పురస్కారం లభించింది. 

విజేతల పూర్తి జాబితా

సీకే నాయుడు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు

-ఫరోఖ్ ఇంజనీర్
-రవిశాస్త్రి

పాలీ ఉమ్రిగర్ బెస్ట్ మెన్స్ అంతర్జాతీయ క్రికెట్ అవార్డు

-2019-20: మహ్మద్ షమీ
-2020-21: ఆర్ అశ్విన్
-2021-22: జస్ప్రీత్ బుమ్రా
-2022-23: శుభమాన్ గిల్

ఉత్తమ అంతర్జాతీయ క్రికెట్ మహిళల అవార్డు

2019-20: దీప్తి శర్మ
2020-21: స్మృతి మంధాన
2021-22: స్మృతి మంధాన
2022-23: దీప్తి శర్మ

బెస్ట్ ఇంటర్నేషనల్ డెబ్యూ మెన్

2019-20: మయాంక్ అగర్వాల్
2020-21: అక్షర్ పటేల్
2021-22: శ్రేయాస్ అయ్యర్
2022-23: యశస్వి జైస్వాల్

బెస్ట్ ఇంటర్నేషనల్ డెబ్యూ ఉమెన్

2019-20: ప్రియా పునియా
2020-21: షఫాలీ వర్మ
2021-22: సబ్బినేని మేఘన
2022-23: అమంజోత్ కౌర్

దిలీప్ సర్దేశాయ్ అవార్డులు

అత్యధిక పరుగులు (భారత్ వర్సెస్ వెస్టిండీస్ 2022-23) - యశస్వి జైస్వాల్ 
అత్యధిక వికెట్లు (భారత్ vs వెస్టిండీస్ 2022-23) - రవిచంద్రన్ అశ్విన్

అత్యధిక పరుగులు (మహిళల ODI)

2019-20: పూనమ్ రౌత్
2020-21: మిథాలీ రాజ్
2021-22: హర్మన్‌ప్రీత్ కౌర్
2022-23: జెమిమా రోడ్రిగ్స్

అత్యధిక వికెట్లు (మహిళల ODI)

2019-20: పూనమ్ యాదవ్
2020-21: ఝులన్ గోస్వామి
2021-22: రాజేశ్వరి గైక్వాడ్
2022-23: దేవికా వైద్య