
దేశం 5జీ వైపు పరుగులు పెడుతోంది. జనాలు 5జీ సేవల్ని పొందడానికి అప్ గ్రేడ్ అవుతుంటే.. కొన్ని గ్రామాలు మాత్రం ఇంకా 4జీ సేవల్ని కూడా పొందట్లేదని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ లోక్ సభలో వెల్లడించారు. ఈ క్రమంలో దేశంలో మొత్తం 6,44,131 గ్రామాలుండగా, అందులో 45,180 గ్రామాలకు 4జీ సేవలు అందుబాటులో లేవని వైష్ణవ్ చెప్పారు.
ఈ లిస్టులో ఒడిశాలో ఎక్కువ గ్రామాలున్నాయి. ఒడిశాలో మొత్తం 47,677 గ్రామాలుండగా, అందులో 7,592 గ్రామాల్లో ఇప్పటికీ 4జీ సేవలు అందుబాటులోకి రాలేదు. తర్వాత స్థానాల్లో మహారాష్ట్ర 3,793 గ్రామాలు, ఆంధ్రప్రదేశ్ లో 3,169 గ్రామాల్లో 4జీ వినియోగం లేదు. ఈ గ్రామాలన్నింటికి 4జీ సేవల్ని అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ ఎన్ ఎల్ కృషిచేస్తుంది. ఈ ప్రాజెక్ట్ కు రూ.26,316 కోట్లు ఖర్చవుతాయని అంచనావేస్తున్నారు. ఇందులో మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో 4జీ సేవల్ని తీసుకురావడానికి రూ.2,211 కోట్లు ఖర్చవుతుందని తెలిపారు.