జ్ఞాన్‌వాపిలో ఆర్కియాలజికల్ సర్వే

జ్ఞాన్‌వాపిలో ఆర్కియాలజికల్ సర్వే

వారణాసి: ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో జ్ఞాన్‌వాపి మసీదును ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్‌ఐ) బృందం శాస్త్రీయ సర్వేను ప్రారంభించింది. వారణాసి కోర్టు ఆదేశాల మేరకు సీల్ చేయబడిన వజుఖానా ప్రాంతం మినహా మిగతా జ్ఞాన్‌వాపి మసీదు సముదాయంలో ఏఎస్ ఐ సర్వీ నిర్వహించనుంది. 

సీల్ చేయబడిన వజుఖాన మినహాయించి జ్ఞాన్‌వాపి మసీదు ప్రాంగణంలో ఏఎస్‌ఐ సర్వే నిర్వహించేందుకు అనుమతిస్తూ వారణాసి కోర్టు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. మసీదు ఆలయంపై నిర్మించబడిందో లేదో తెలుసుకోవడానికి అవసరమైన చోట తవ్వకాలతో సహా వివరణాత్మక శాస్త్రీయ సర్వేను నిర్వహించాలని జిల్లా న్యాయమూర్తి ఎకె విశ్వేష్ శుక్రవారం ASIని ఆదేశించారు. సర్వే ప్రక్రియకు సంబంధించిన వీడియోలు, ఫొటోలతో కూడిన నివేదికను ఆగస్టు 4లోగా కోర్టుకు సమర్పించాలని ఏఎస్‌ఐని న్యాయమూర్తి ఆదేశించారు. 

#WATCH | Varanasi, UP: ASI (Archaeological Survey of India) to conduct survey of the Gyanvapi mosque complex today

Visuals from outside the Gyanvapi premises pic.twitter.com/VrvywzKp99

— ANI UP/Uttarakhand (@ANINewsUP) July 24, 2023