
మహ్మద్ ప్రవక్తను దూషించి మరణశిక్షను ఎదుర్కొంటున్న పాక్ క్రైస్తవ మహిహ ఆసియా బీబీకి ఆ దేశ సుప్రీం కోర్టు ఊరటనిచ్చింది. 2009లో ఆసియా బీబీ చేసిన కీలక వ్యాఖ్యలపై అక్కడి ట్రయల్ కోర్టు 2010 నవంబర్‌లో మరణశిక్షను విధించింది. ఆ తీర్పును లాహోర్ హైకోర్టు కూడా సమర్థించింది. ఈ కేసులో ఆసియా 8 ఏళ్ల జైలు శిక్షను అనుభస్తున్న ఆసియా బీబీకి సుప్రీం తాజా తీర్పు స్వేచ్ఛనిచ్చింది. జైలునుంచి విడుదలైన ఆసియా బీబీ తన ఇద్దరు పిల్లలతో కెనడా వెళ్లినట్లు ఆమె తరపు లాయర్ తెలిపారు. అయితే ఈ విషయం పై పాక్ ప్రభుత్వం మాత్రం ఎలాంటి వివరణ ఇవ్వలేదు.