ఆసియా కప్ కోసం అఫ్గానిస్థాన్ జట్టు ఇదే

 ఆసియా కప్ కోసం అఫ్గానిస్థాన్ జట్టు ఇదే

యూఏఈలో ఆగస్టు 27 నుంచి జరగనున్న ఆసియా కప్ 2022 కోసం 17 మంది సభ్యుల జట్టును ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు మంగళవారం ప్రకటించింది. ఐర్లాండ్‌లో జరుగుతున్న టీ20 సిరీస్‌లో ఆఫ్ఘనిస్తాన్‌కు నాయకత్వం వహిస్తున్న మహ్మద్ నబీ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. నజీబుల్లా జద్రాన్ జట్టుకు వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఆసియా కప్  లో భాగంగా ఆగస్టు 27న శ్రీలంకతో ఆఫ్ఘనిస్తాన్  తన మొదటిమ్యాచ్ ను ఆడనుంది. 

జట్టు ఇదే 

మహ్మద్ నబీ (కెప్టెన్), నజీబుల్లా జార్దాన్ (వైస్ కెప్టెన్), అప్సర్ జజాయ్ (వికెట్ కీపర్), అజ్మతుల్లా ఒమర్‌జాయ్, పరీద్ అహ్మద్ మాలిక్, ఫజల్ హక్ ఫరూక్, హస్మతుల్లా షాహిదీ, హజ్రతుల్లా జజాయ్, ఇబ్రహీం జర్దాన్, కరీమ్ జనత్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, నజీబుల్లా జర్దాన్, నవీన్ ఉల్ హక్, నూర్ అహ్మద్, రహ్మతుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), రషీద్ ఖాన్, సమీవుల్లా సిన్వారి.